మంత్రిగా తప్పు చేశా.. దానికి చంద్రబాబే కారణం

Update: 2020-02-08 07:50 GMT
తాను మంత్రిగా ఉన్నప్పుడు చేసిన తప్పునకు టీడీపీ అధినేత చంద్రబాబే కారణమని అప్పటి ఉమ్మడి ఏపీ మంత్రి, ఇప్పటి మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. గతంలో చేసిన తన తప్పును ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు ప్రవర్తన తీరుతోనే ఆ తప్పును చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. ఇంతకు మంత్రి ఏం తప్పు చేశారు? ఆ తప్పునకు చంద్రబాబు కారణం ఎలా అంటే..

ఒకప్పుడు బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్నారు. సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో బొత్స కూడా ఉన్నాడు. మంత్రిగా ఉండగా ఆయన పెద్ద అవినీతికే పాల్పడ్డారు. వోక్స్ వ్యాగన్ కంపెనీకి ప్రభుత్వ సొమ్మును ధారాదత్తం చేసిన వారిలో బొత్సనే కీలక నిందితుడు. అప్పుడు బొత్సను వైఎస్సార్ వెనకేసుకొచ్చి అండగా నిలబడ్డారు. దాన్నుంచి బయటపడేలా చేశారు. దీంతో బొత్స జైలు నుంచి తప్పించుకున్నారు. తాను తప్పు చేశానని ఇన్నాళ్లు అంగీకరించి దానికి చంద్రబాబు అని ప్రకటించడం అందరూ అవాక్కయ్యారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వోక్స్ వ్యాగన్ కంపెనీని తీసుకొస్తానని ప్రభుత్వం తో షూస్టర్ చర్చలు చేసి డబ్బు దండుకున్నారు. ఆ తర్వాత ఆ కంపెనీ ఏపీకి రాలేదు.. దీంతో అతడు మోసం చేశాడు. అయితే షూస్టర్ ను బాగా నమ్మడానికి కారణం చంద్రబాబు అని తెలిపారు. షూస్టర్ కు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు ఓ రేంజిలో గౌరవమిచ్చాడని, అల్లుడికి ఇచ్చిన స్థాయిలో షూస్టర్ కు గౌరవమివ్వడంతో షూస్టర్ ను తాను కూడా నమ్మినట్లు వివరణ ఇచ్చారు. ఆ గౌరవాన్ని చూసిన తాను షూస్టర్ ను గుడ్డిగా నమ్మేశానని, అయితే అదే తనను కొంప ముంచిందని తెలిపారు.
Tags:    

Similar News