ఫిర్యాదు చేసినందుకు వలంటీర్ ఘాతుకం

Update: 2020-07-08 13:30 GMT
ఏపీలోని గ్రామ సచివాలయ వలంటీర్ల ఘాతుకాలు శృతిమించుతున్నాయి. వరుసగా వారి సంఘటనలు కలకలం రేపుతున్నాయి. మొన్నటికి మొన్న ఒక బాలికను గర్భవతిని చేసి పంచాయితీ పెట్టిన వలంటీర్ ఘటన కలకలం రేపింది.ఇక మరో ఘటనలో పింఛన్ డబ్బులన్నీ వలంటీర్ దోచుకుపోయాడు. ఇప్పుడు తాజాగా తనపై ఫిర్యాదు చేసిన పాపానికి ఒక గ్రామస్థుడిపై కత్తులతో దాడి చేశాడు. ఈ దారుణం ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది.

ప్రకాశం జిల్లాలోని రాచర్ల మండలం ఒద్దుల నాగుపల్లిలో ఈ దారుణం వెలుగుచూసింది. ఒక వార్డులోని వ్యక్తి వలంటీర్ ఫిర్యాదు చేశాడు. దీంతో కోపం పెంచుకున్న వలంటీర్.. తన ఇంటికి ఆ వ్యక్తిని పిలిపించి కత్తులతో దాడి చేశారు.

సచివాలయంలో తనపై ఫిర్యాదు చేశాడనే కోపంతో రాత్రి ఫోన్ చేసి మరీ ఫిర్యాదుదారుడిని ఇంటికి పిలిపించి వాగ్వాదం పెట్టుకొని లైట్స్ ఆఫ్ చేసి కత్తులతో దాడి చేశాడు. ప్రస్తుతం తీవ్ర గాయాలతో ఆ బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఇప్పటికే వలంటీర్ పై 2 సార్లు పై అధికారులకు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని బాధితుడు వాపోయాడు.
Tags:    

Similar News