తెలంగాణ‌లో ఓట‌ర్లు పెరిగార‌ట‌!

Update: 2018-09-01 05:56 GMT
తెలంగాణ‌లోని ఓట‌ర్ల‌పై తాజా లెక్క‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. మొన్న‌టికి మొన్న తెలంగాణ‌లో భారీగా ఓట్లు త‌గ్గినట్లుగా వార్త‌లు వ‌చ్చాయి. దీనికి భిన్నంగా తాజాగా ముసాయిదా ఓట‌ర్ల జాబితానుసిద్ధం చేసిన‌ట్లుగా ఎన్నిక‌ల సంఘం వెల్ల‌డించింది. ఈ లెక్క‌ల్ని శ‌నివారం అధికారికంగా ప్ర‌క‌టించ‌నుంది.

తాజాగా విడుద‌ల చేసే ఓట‌ర్ల జాబితాను ఈ రోజు (శ‌నివారం) విడుద‌ల చేయ‌నున్నారు. అధికారికంగా విడుద‌ల కావాల్సిన ఓట‌ర్ల జాబితాల‌కు సంబంధించిన లెక్క‌లు కొన్ని ముందే వ‌చ్చేశాయి. ఈ లెక్క‌ల ప్ర‌కారం జ‌న‌వ‌రితో పోలిస్తే.. తాజాగా ఓట‌ర్ల సంఖ్య పెరిగిన వైనం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ ముసాయిదాపై  ఏమైనా అభ్యంత‌రాలు ఉంటే.. వాటిని అక్టోబ‌రు 30 వ‌ర‌కు ఆహ్వానిస్తారు. అనంత‌రం వాటిలోని మార్పుల మీద దృష్టి సారిస్తారు.

కొత్త జాబితాను 2019 జ‌న‌వ‌రిలో విడుద‌ల చేస్తారు. ఇప్ప‌టివ‌ర‌కూ అందిన స‌మాచారం ప్ర‌కారం ఈ ఏడాది జ‌న‌వ‌రి నాటికి  ఉన్న ఓట్ల‌తో పోలిస్తే.. తాజాగా ఎనిమిది ల‌క్ష‌ల‌కు పైగా ఓట్లు పెరిగాయి. జ‌న‌వ‌రిలో విడుద‌లైన ఓట‌ర్ల జాబితా ప్ర‌కారం చూస్తే.. తాజాగా చేసిన మార్పులు 8.08ల‌క్ష‌ల మంది అద‌నంగా జాబితాలోకి చేరిన‌ట్లుగా చెబుతున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఓట‌ర్లు 2,61,36,776 కాగా.. ఇందులో పురుష ఓట‌ర్లు 1,32,68,676 కాగా మ‌హిళా ఓట‌ర్లు 1,28,65,193.  థ‌ర్డ్ జెండ‌ర్ ఓట‌ర్లు 168 మంది ఉన్న‌ట్లుగా గుర్తించారు.


Tags:    

Similar News