ఏపీ విపక్ష నేత.. టీడీపీ అధినేత చంద్రబాబుకు దిమ్మ తిరిగిపోయే షాక్ తగిలింది. తాజాగా మండలి పరిషత్ ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రం మొత్తం సంగతిని పక్కన పెడితే.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోనూ ఓటర్లు ఆయనకు దిమ్మ తిరిగిపోయేలా షాకిచ్చారు. అంతేనా.. ఆయన సొంతూరు నారావారి పల్లెలోనూ షాక్ తప్పలేదు. తాజాగా విడుదలైన ఫలితాల్ని చూస్తే.. నారావారిపల్లి ఎంపీటీసీ సీటును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి గంగాధరం పరాజయం పాలైతే.. ఆయనకు ప్రత్యర్థిగా బరిలోకి దిగిన వైసీపీ అభ్యర్థి రాజయ్య 1347 ఓట్ల తేడాతో గెలుపొందటం గమానార్హం. టీడీపీ అభ్యర్థికి కేవలం 307 ఓట్లు మాత్రమే పోలయ్యాయి.
కుప్పం నియోజకవర్గ పరిధిలో విడుదలవుతున్న ఫలితాల్ని చూస్తే.. చంద్రబాబు పార్టీ కుప్పకూలిపోయినట్లుగా ఉందని చెప్పాలి. సార్వత్రిక ఎన్నికల తర్వాత నుంచి జరుగుతున్న ప్రతి ఎన్నికల్లోనూ షాకులు తప్పని చంద్రబాబుకు పరిషత్ ఫలితం మరింత కోలుకోలేని రీతిలో ఉన్నాయని చెప్పాలి. మిగిలిన రాష్ట్రం మొత్తం సంగతి ఎలా ఉన్నా.. పార్టీ అధినేత ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనూ నిరాశపూరిత ఫలితాలు రావటంతో పెద్ద దెబ్బగా చెప్పక తప్పదు.
నాలుగు మండలాల్లో వైసీసీ విజయం సాధించగా.. కుప్పం మండలంలో 19 ఎంపీటీసీలకు వైసీపీకి 17 స్థానాలు.. టీడీపీకి కేవలం రెండు స్థానాలు మాత్రమే గెలుపొందాయి. గుడిపల్లె మండలంలో 12 స్థానాలకు 12 ఎంపీటీసీలు వైసీపీ కైవశం చేసుకొని క్లీన్ స్వీప్ చేసింది. రామకుప్పం మండలంలో 16 స్థానాలకు 16 ఎంపీటీసీలు వైసీపీ విజయం సాధించింది. శాంతిపురం మండలంలో మాత్రం 18 స్థానాలకు 11 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించగా.. మిగిలిన స్థానాల్లో టీడీపీ గెలుపొందింది. మిగిలిన మూడు మండలాలతో పోలిస్తే.. శాంతిపురంలో కాసిన్ని స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారని చెప్పాలి.
తాజా పరిషత్ ఫలితాల్లోనే కాదు.. ఈ ఏడాది ఏప్రిల్ లో జరిగిన పంచాయితీ ఎన్నికల్లోనూ చంద్రబాబు ప్రతినిధ్యం వహిస్తున్న కుప్పంలో ఓటమి పాలు కావటం తెలిసిందే. నాలుగు మండలాల్లోని 89 పంచాయితీల్లో 75 చోట్ల వైసీపీ నేతలు విజయం సాధించగా.. టీడీపీ కేవలం 14 పంచాయితీల్లోనే గెలుపొందింది. బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గ పరిధిలోని పంచాయితీల్లో 85 శాతం స్థానాల్ని వైసీపీ విజయం సాధించింది. పరిషత్ ఎన్నికల్లో అంతకు మించి అన్న రీతిలో ఫలితాలు రావటం బాబును కుంగదీయటమే కాదు.. బాబు పార్టీ ఆయన ఇలాకాలోనే దారుణంగా దెబ్బ తిందన్న వాదనకు బలం చేకూరేలా తాజా ఫలితాలు ఉన్నాయని చెప్పక తప్పదు.