తెలంగాణ లో రెవెన్యూ వ్యవస్థను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా రోజుల నుండి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. దీనికి ప్రధాన కారణం .. రాష్ట్రంలో అత్యధికంగా ఈ రెవెన్యూ శాఖలో లంచాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు వస్తుండటమే. తాజాగా కొందరు అధికారులు కోట్ల రూపాయాల్లో లంచాలు తీసుకుంటూ పట్టుబట్టడం చర్చగా మారింది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ రద్దుకు తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. వీఆర్వోల నుంచి రికార్డులన్నీ స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్ లకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు... మధ్యాహ్నం 3 గంటలకల్లా రికార్డులు స్వాధీనం చేసుకుని, సాయంత్రం 5 గంటల సమయానికి రిపోర్ట్ పంపాలని కలెక్టర్లకు ఆదేశాలు అందాయి.
తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టం కోసం ఇప్పటికే ముసాయిదాను తయారు చేసిన ప్రభుత్వం, దీనిపై చర్చలు జరుపుతుంది. రెవెన్యూలో అవినీతికి వీఆర్వోల ద్వారానే ఎక్కువగా ఉందన్న నిర్ణయానికి వచ్చిన సర్కార్… ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లును చట్టం చేయనుంది. అయితే, రెవెన్యూ సంఘాలతో పాటు ఇతర కొన్ని ముఖ్యమైన ఉద్యోగ సంఘాలతో సీఎం కేసీఆర్ చర్చలు జరిపే అవకాశం ఉంది. కానీ ఈలోపే ప్రభుత్వం తరుపున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. మద్యాహ్నం 3గంటల్లోపు ఏ ఒక్క వీఆర్వో దగ్గర రెవెన్యూ రికార్డులు ఉండకూడదని చెప్పినట్లు తెలుస్తోంది. ఇక , ఇప్పటికే తహశీల్దార్ల నుంచి వీఆర్వో లందరికి ఆదేశాలు అందినట్టు రెవెన్యూ ఉద్యోగుల సంఘం నేతలు చెబుతున్నారు. అయితే, దీనిపై మాకు చాలా అనుమానాలు ఉన్నాయి.. మా అనుమానాలను ప్రభుత్వం నివృత్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు రెవెన్యూ ఉద్యోగుల సంఘం నేతలు.. మా సర్వీస్ పరిస్థితి ఏంటి? మేం ఏ శాఖలో ఉద్యోగులం అవుతామో చెప్పాలి అని ప్రశ్నిస్తున్నారు.