సుదీర్ఘ కాలం సాగిన కొవిడ్ ఎపిసోడ్ తో పలు దేశాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అగ్ర రాజ్యం అమెరికా.. కొవిడ్ కాలంలో తమ దేశానికి వచ్చే వారికి సంబంధించిన పరిమితుల్ని పెద్ద ఎత్తున అమలు చేయటం తెలిసిందే. కొవిడ్ కేసులు తగ్గుతున్న వేళ.. అమెరికా కు రావాలనుకునే వారికి అనువుగా.. వీసాల్నిజారీ చేసే ప్రక్రియల్ని షురూ చేశారు. దీంతో.. అగ్ర రాజ్యానికి ప్రయాణ మయ్యేందుకు బారులు తీరుతున్నారు. అయితే.. ఇలాంటి వారి కి తాజాగా ఎదురవుతున్న ఇబ్బంది వీసా అపాయింట్ మెంట్.
భారత్ లోని వీసాలు జారీ చేసే ఆఫీసుల్లో ఇప్పుడు అపాయింట్ మెంట్ దొరకటం చాలా కష్టంగా ఉంది. ఇలాంటివేళ.. ఈ అంశంపై తాజాగా అమెరికా రాయబార కార్యాలయం కీలక వ్యాఖ్య చేసింది. వలసేతర వీసా కేటగిరిలో వీసాలు పొందాలనుకునే వారు మరింత కాలం వెయిట్ చేయక తప్పదని స్పష్టం చేసింది. నవంబరు ఎనిమిది నుంచి అమెరికా ప్రయాణాలకు ఓకే చెప్పిన వేళ.. రెండు టీకా డోసులు వేసుకున్న దాదాపు 30 లక్షల మంది భారతీయులకు అమెరికాకు వెళ్లే అవకాశం ఉంది. అయితే.. కొవిడ్ కారణంగా ఏర్పడిన ఇష్యూలను ఒక కొలిక్కి తీసుకొస్తున్నట్లు రాయబార కార్యాలయం చెప్పింది. అందుకే.. రాయబార.. కాన్సులేట్ కార్యాలయాల్లో పనులుకాస్త ఆలస్యం అవుతాయని పేర్కొంది.
లక్షలాది మంది భారతీయులు వీసాల రెన్యువల్ కోసం.. కొత్త వీసాల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే.. ఎంబసీ నుంచి అపాయింట్ మెంట్లు అంత సులువుగా లభించే అవకాశం లభించటం లేదు. తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికాకు వెళ్లాలని భావిస్తున్న వారి వెయిటింగ్ లిస్టు భారీగా ఉంది. దీంతో.. అపాయింట్ మెంట్ లభించటంకష్టంగా మారటమే కాదు.. ఆంక్షల్ని ఎత్తి వేసిన వేళ.. అమెరికాకు వెళ్లటం వెంటనే జరగకపోవచ్చని చెబుతున్నారు. వీసా అపాయింట్ మెంట్ కోసం మరికొంత కాలం వెయిట్ చేయక తప్పదని.. వీలైనంత త్వరగా పనులు జరిగేలా చూస్తామని చెబుతున్నా.. కాన్సులేట్ కు వెల్లువెత్తుతున్న దరఖాస్తుల్ని పరిష్కరించటం అంత త్వరగా పూర్తి కాదని స్పష్టం చేస్తున్నారు.