ఖడ్గం సినిమాతో తెలుగు వారికి పరిచయమైంది బాలీవుడ్ కథానాయిక కిమ్ శర్మ. వేడెక్కించే అందాలతో కుర్రకారుపై మత్తు చల్లింది. బాలీవుడ్ లో కెరీర్ సాగించిన ఈ అమ్మడికి ఇంటర్నేషనల్ లెవల్లో ఉన్న కాంటాక్ట్స్ గురించి తెలిసిందే. బాలీవుడ్ లో ఐటెమ్ గాళ్ గా నటిస్తూనే ఆ క్రేజుతో కెన్యా డ్రగ్స్ కింగ్ అలీ పుంజానీ కంట్లో పడింది. ఆ తర్వాత ఆ ఇద్దరి మధ్యా ప్రేమాయణం.. పెళ్లి.. బ్రేకప్ ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. ఆ తర్వాత కొంతకాలానికి యువహీరో హర్షవర్ధన్ రాణేతో ప్రేమలో పడింది. ఓ సినిమా షూటింగ్ లో కలుసుకున్న ఈ జంట ఘాటైన ప్రేమాయణం సాగించడంపై బాలీవుడ్ మీడియా కోడై కూసింది.
అదంతా గతం. వర్తమానంలో కిమ్ శర్మ సింగిల్ స్టాటస్ ని ఎంజాయ్ చేస్తోంది. తిరిగి బాలీవుడ్ లో నటించేందుకు సన్నాహకాల్లో ఉంది. అయితే ఈలోగానే తన మాజీ భర్త అలీ పుంజానీ గురించిన ప్రకంపనాలు రేపే వార్త వెలువడింది. కెన్యాలో డ్రగ్స్ మాఫియా అంతం చూసే దిశగా అక్కడ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. దీంతో మాఫియాని ఏరేసేందుకు పోలీసులు కంకణం కట్టుకున్నారు. అక్కడ మాఫియాల మధ్య అంతర్యుద్ధం వల్ల తాజాగా కిమ్ మాజీ భర్త అలీ పుంజానీ పేరును ప్రత్యర్థులు వెల్లడించారు. దాంతో అతడి ఇంటిని చుట్టుముట్టిన పోలీస్ అలీ పుంజానీకి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
ఇంతలోనే ఊహించని మరో ట్విస్ట్ ఏమిటంటే అలీ పుంజానీ ప్రస్తుతం కెన్యా వదిలి ఇండియాలో అడుగుపెట్టాడట. ఇక్కడ ముంబైలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో అనారోగ్యానికి చికిత్స పొందుతున్నాడని ప్రచారం సాగుతోంది. ఇదంతా తన అరెస్టును వాయిదా వేసేందుకు అతడు ఆడుతున్న డ్రామా! అని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు దేశం వదిలి వెళ్లిన డ్రగ్ డాన్ అలీ పుంజానీ తిరిగి కెన్యాకి వచ్చి పోలీసులకు లొంగిపోవాల్సిందిగా వార్నింగ్ ఇచ్చారు. ఈ గొడవలో డ్రగ్ డాన్ బుక్ అయినట్టేనని ముంబై పోలీసులు చెబుతుండడం ఆసక్తికరం. అమెరికా- ఇండియా-ఆఫ్ఘన్ తదితర దేశాల్లో అలీపుంజానీ డ్రగ్స్ వ్యాపారం విస్తరించి ఉందని చెబుతున్నారు.