మోడీ పై వార్: విపక్షాల సమావేశం సక్సెస్.. రిజల్ట్ మాత్రం సస్పెన్స్!
ప్రధాని నరేంద్ర మోడీని గద్దె దింపడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా బీజేపీయేతర ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష పార్టీల అధినేతలు.. నడుం బిగిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా బిహార్ సీఎం నితీష్‌కుమార్ ఆహ్వానం మేరకు శుక్రవారం పట్నాలో వీరంతా భేటీ అయ్యారు.
అయితే.. సమావేశం మాత్రం సూపర్ సక్సెస్ అయింది. కానీ, రిజల్ట్ మాత్రం సస్పెన్స్‌గానే ఉండడం గమనార్హం. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేయాలని తామంతా నిర్ణయించామని బీహార్ ముఖ్యమంత్రి, ఐక్య కూటమి ఏర్పాటుకు సంధానకర్తగా వ్యవహరిస్తున్న జేడీయూ నేత నితీష్ కుమార్ తెలిపారు.
నితీష్ సారథ్యంలో పాట్నాలో ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన విపక్ష పార్టీల సమావేశం మధ్యాహ్నం 3.30 గంటల వరకూ జరిగింది. సమావేశానంతరం నితీష్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ తదితరులు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత సమావేశం సక్సెస్ అయిందని అయితే.. మరింత చర్చల కోసం త్వరలోనే మరో సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు నితీష్ తెలిపారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ మాట్లాడుతూ.. ఇది సిద్ధాంతాల మధ్య పోరు అని పేర్కొన్నారు. నిజానికి, తమలో విభేదాలు ఉన్నప్పటికీ కలిసికట్టుగా పోరాడాలని నిర్ణయించుకున్నామని, సిద్ధాంతాలపై పరస్పరం చర్చించుకుని వాటిని పరిరక్షించుకు నేందుకు కృషిచేయాలని నిర్ణయించామని చెప్పారు. దేశపునాదులపై బీజేపీ దాడి చేస్తోందని, ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా పోరాడితేనే దేశాన్ని రక్షించుకోవచ్చని అన్నారు.
విపక్షాలన్నీ కలిసికట్టుగా ఉన్నాయని, కలిసికట్టుగానే ఎన్నికల్లో పోరాడతాయని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. బీహార్ నుంచే చరిత్ర ప్రారంభమైందని, హిస్టరీని మార్చాలని బీజేపీ కోరుకుంటోందని అన్నారు. బీహార్ నుంచే చరిత్రను కాపాడాలని తాము అనుకుంటున్నట్టు చెప్పారు. ఫాసిస్ట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపించడమే తమ లక్ష్యమని ఆమె చెప్పారు.
కేసీఆర్ సహా అనేక మంది ఊసు లేదు!మోడీ పై యుద్ధం చేస్తామని చెప్పిన వారిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా.. ఒడిసా సీఎం నవీన్ పట్నాయక్ వంటివారు హాజరు కాకపోవడం గమనార్హం. నితీష్ ఆధ్వర్యంలో జరిగిన విపక్షాల సమావేశంలో ఖర్గే, రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, ఎంకే స్టాలిన్, హేమంత్ సోరెన్, అఖిలేష్ యాదవ్, ఉద్ధవ్ థాకరే, శరద్ పవార్, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ తదితర నేతలు పాల్గొన్నారు. తదుపరి సమావేశం మల్లికార్జున్ ఖర్గే సారథ్యంలో సిమ్లాలో జూలై 10-12 తేదీల్లో నిర్వహించనున్నారు.