ఇప్పుడంటే.. వైద్య వసతులు పెరిగాయి. అనేకచోట్ల ఆస్పత్రులు ఆధునిక వసతులతో ఏర్పాటవుతున్నాయి. అత్యంత అరుదైన స్త్రచికిత్సలూ సులువుగా చేయగలుగుతున్నారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ వైద్య రాజధానిగా ఎదిగింది. కానీ, ఒకప్పడు తెలంగాణ వ్యాప్తంగా వైద్యానికి హైదరాబాద్ వచ్చేవారు కాదు. ఉత్తర తెలంగాణకు వైద్య అంటే వరంగల్ పెద్ద దిక్కు. ఇన్నాళ్లుగా వరంగల్ లోని మహాత్మ గాంధీ మెమోరియల్ (ఎంజీఎం) ఆస్పత్రి విశేష సేవలందిస్తోంది. ఇకపై మరో అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి అందుబాటులోకి రానుంది. మొత్తం 15 ఎకరాల్లో 24 అంతస్తులతో దీనిని నిర్మించనున్నారు.
హెల్త్ సిటీలో భాగంగా
వరంగల్ హెల్త్ సిటీలో భాగంగా.. వరంగల్ కేంద్ర కారాగార స్థానంలో రూ.1100 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి ప్రభుత్వం రూ.1100 కోట్లు మంజూరు చేస్తూ శనివారం ఉత్తర్వులిచ్చింది. ఈ ఆస్పత్రి నిర్మాణం కోసం.. ఇప్పటికే ఉన్న వరంగల్ సెంట్రల్ జైలును కూల్చివేసి స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఖైదీలను ఇతర ప్రాంతాల్లోని సబ్ జైలుకు, కొందరిని చంచల్ గూడ జైలుకు తరలించారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్.. కొత్త ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఏ పనులకు ఎంతంటే..
తాజాగా ఇచ్చిన రూ.1100 కోట్లలో రూ.509 కోట్లు సివిల్ పనులకు, మంచినీరు, పారిశుద్ధ్యం కోసం రూ20.36 కోట్లు, మెకానికల్, ఎలక్ట్రిసిటీ, ప్లంబింగ్ పనుల కోసం రూ.182 కోట్లు, వైద్య పరికరాలకు రూ.105 కోట్లు, అనుబంధ పనులకు రూ.54 కోట్లు, చట్టబద్ధమైన పనులు, పన్నుల కోసం రూ.229 కోట్లు కేటాయించారు. ఇక ఇప్పటివరకు సేవలందించిన వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిని మాతా శిశు సంరక్షణ కేంద్రంగా మార్చనున్నారు.
ఉత్తర తెలంగాణకు వరప్రదాయిని
వరంగల్ లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి అందుబాటులోకి వస్తే ఉత్తర తెలంగాణ ప్రజలకు పెద్ద దిక్కుగా నిలవనుంది. ఖరీదైన, ఆధునిక వైద్యం ఉచితంగా పొందేందుకు ఇకపై ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్ తో పాటు వరంగల్ ప్రజలు హైదరాబాద్ రావాల్సిన అవసరం ఉండదు. అంతేకాక హైదరాబాద్ లోని ప్రభుత్వ దవాఖానాలపై పనిభారం తగ్గుతుంది.
అదిరిపోయే నమూనా.. 2 వేల పడకలు
వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి భవనం నమూనాను ప్రభుత్వం విడుదల చేసింది. విశాలమైన ప్రాంగణం.. హరిత అందాలతో పాటు భారీ భవనాలతో ఆస్పత్రి నమూనా ఆకట్టుకునేలా ఉంది. ఆస్పత్రిలో మొత్తం 2 వేల పడకలు, 36 విభాగాలుంటాయి. 500 మందిపైగా వైద్యులు, వెయ్యి మంది పైగా నర్సులు, పారామెడికల్ సిబ్బంది సేవలందిస్తారు. 2 వేల పడకల్లో 1,200 పడకలు జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఈఎన్టీ, డెర్మటాలజీ, ఆర్థోపెడిక్స్ విభాగాలకు కేటాయిస్తారు. 800 పడకలను కార్డియాలజీ, కార్డియో థొరాసిక్, అంకాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ, యూరాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ, వంటి సూపర్ స్పెషాలిటీ విభాగాలలో సేవలందిస్తారు. ఇదే ప్రాంగణంలో వైద్య, దంత కళాశాలలను ఏర్పాటు చేస్తారు.
మరిన్ని ప్రత్యేకతలు
కిడ్నీ, కాలేయం, వంటి అవయవాల మార్పిడికి సౌకర్యాలు అందుబాటులో ఉండేలా ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేస్తారు. కీమోథెరపీ, రేడియేషన్ సౌకర్యాలతో అత్యాధునిక కేన్సర్ కేంద్రం ఏర్పాటవుతుంది. రోగులు, వారి సహాయకులకు ప్రత్యేక సౌకర్యాలుంటాయి. వైద్యులు, విద్యార్థులు, సిబ్బందికి వసతి సౌకర్యం కల్పిస్తారు.
హెలిప్యాడ్ సైతం..
అత్యవసర పరిస్థితుల్లో రోగులను హెలికాప్టర్ లో తరలించేందుకు ఆస్పత్రి వద్ద హెలిప్యాడ్ నిర్మించనున్నారు.