ఆ విషయంలో చంద్రబాబు గొంతు మూగబోయిందా?

Update: 2021-03-27 14:34 GMT
జాతీయ స్థాయిలో ఒకప్పుడు చక్రం తిప్పిన పెద్ద నేత చంద్రబాబు. అలాంటి చంద్రబాబు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోగానే అస్త్ర సన్యాసం చేసి సైలెంట్ అయిపోయాడు. ఎన్నికలకు ముందు వరకు మోడీపై శివాలెత్తిన చంద్రబాబు ఓటమి తర్వాత ఎందుకో మోడీ అంటేనే భయపడిపోతున్నాడు.

ఇప్పుడు జాతీయ స్థాయిలో దేశం మొత్తాన్ని బీజేపీ ప్రైవేటు పరం చేస్తోంది. అన్ని కంపెనీలను, ప్రైవేటు పరం చేసి ముఖ్యంగా అంబానీ, అదానీలకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇస్తోందన్న ప్రచారం సాగుతోంది. జాతీయ నాయకుడు అయిన చంద్రబాబు ఎందుకు ఈ విషయంలో మాట్లాడడం లేదని అని పలువురు మేధావులు ప్రశ్నిస్తున్నారు.

ఇంత పెద్ద ఎత్తున దేశంలో కార్పొరేట్ దొంగలు దేశాన్ని దోచుకొని పోతుంటే జాతీయ నాయకుడు ఎందుకు నోరు మెదపడం లేదు అని సోషల్ మీడియాలోనూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు, రామోజీరావులకి.. అంబానీ ఫ్యామిలీలతో మంచి అనుబంధం ఉంది కాబట్టి.. అందుకే మాట్లాడడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. లేక కేసులకు భయపడి చంద్రబబు ఊరుకుంటున్నాడా? రాబోయే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే జగన్ ను దెబ్బతీయవచ్చు అని ఇలా మౌనంగా ఉంటున్నాడా? అని అడుగుతున్నారు.

ఒకప్పుడు దేశంలో చక్రం తిప్పిన చంద్రబాబు ఇలా వ్యవహరించడాన్ని టీడీపీ పెద్దలు కూడా జీర్ణించుకోవడం లేదట..  టీడీపీ పెద్దలే ఇది మా నాయకుడికి మంచిది కాదు అని అంటున్నారు. ఒకప్పుడు జాతీయ మీడియా మా వైపు చూస్తుంటే.. ఇప్పుడు అదే మీడియా మమ్మలను అస్సలు పట్టించుకోవడం లేదు అని అంటున్నారు. చంద్రబాబు ఎలాగైనా నోరు విప్పాలని కోరుతున్నారట..
Tags:    

Similar News