సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారమిది. తన అమెరికా పర్యటనలో భాగంగా వైట్ హౌస్ కు వెళ్లిన ప్రధాని మోడీ విషయంలో ఆసక్తికరమైన ఉదంతం ఒకటి చోటు చేసుకుంది. వైట్ హౌస్ వద్దకు ప్రత్యేక కారులో మోడీ వెళ్లారు. ఆయనకు స్వాగతం చెప్పటానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఆయన సతీమణి మెలానియా ఇద్దరూ ఎదురుచూస్తున్నారు. మోడీ కారు శ్వేతసౌధంలోకి వచ్చి ఆగింది.
ఇద్దరు గార్డులు మోడీ కారు వద్దకు చేరుకున్నారు. ఒకరు కుడి వైపు ఉన్న డోర్ వద్దకు వెళితే.. మరొకరు ఎడమవైపు కారు డోర్ వద్ద నిలుచున్నాడు. క్షణాల వ్యవధిలో ఇద్దరు గార్డులు.. రెండు వైపులున్న కారు డోర్లను తీశారు. కుడి వైపు నుంచి మోడీ దిగారు.అయితే.. ఈ వీడియో క్లిప్పింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇంతకూ.. ఈ వీడియో ఎందుకు వైరల్ గా మారిందంటే.. ఎడమవైపు కారు డోర్ ను గార్డు తీయటమేనట. దీన్లో తప్పేముందన్న దానికి.. సోషల్ మీడియాలోని కొందరు వినిపిస్తున్న వాదన ఏమిటంటే.. సాధారణంగా దేశాధినేతలతో పాటు వారి సతీమణులు రావటం కామన్. దేశాధినేత కారు కుడి వైపు డోర్ నుంచి దిగితే.. వారి జీవిత భాగస్వాములు ఎడమ వైపు డోర్ నుంచి బయటకు దిగుతుంటారు. మోడీ విషయంలోనూ అదే జరిగింది. అయితే.. ఆయన సతీమణికి దూరంగా ఉంటున్న విషయాన్ని వైట్ హౌస్ గార్డులు మర్చిపోయి ఉంటారన్నది వారి చిలిపి వాదన.
అయితే.. ప్రోటోకాల్ ప్రకారం.. రెండు వైపులా డోర్లు తీయటం ఒక భాగమని.. అందులో భాగంగానే డోర్లు తీస్తారే తప్పించి.. మోడీ సతీమణి ఉండరన్న విషయం తెలియత డోర్ తీశారని పెడర్థం తీయటం సరికాదని పలువురు హితవు పలుకుతున్నారు. ప్రతి విషయాన్ని భూతద్దంలో చూస్తే.. తమకు తోచినట్లుగా అర్థాలు తీసేయటం ఇప్పుడు ఓ అలవాటుగా మారిన వేళలో.. ఇలాంటి కామనే అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/