టీవీ చూసే అల‌వాటుందా? డేంజ‌ర్లో మీ హెల్త్‌!

Update: 2019-07-04 04:02 GMT
ఇవాల్టి రోజున టీవీ చూడ‌నోడు ఉంటాడా? అనొచ్చు. కానీ.. టీవీ చూస్తుండిపోవ‌టం వ‌ల్ల జ‌రిగే అన‌ర్థం గురించి తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చిన ఒక అధ్య‌య‌నం ఆస‌క్తిక‌రంగానే కాదు షాకింగ్ గా మారింది. ఎందుకంటే.. ఉత్త‌నే రోజంతా కూర్చునే క‌న్నా గంట‌ల త‌ర‌బ‌డి టీవీ చూడ‌టం వ‌ల్ల ముప్పు ఎక్కువ‌న్న చేదు నిజం ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది.

అమెరికాకు చెందిన హార్ట్ అసోసియేష‌న్ జ‌రిపిన ప‌రిశోధ‌న‌లో రోజూ నాలుగు గంట‌లు టీవీ చూసే వారిలో  50 శాతానికి పైనే ముందుగా మ‌ర‌ణిస్తార‌ని చెప్పారు. టీవీ చూసే వాళ్ల‌లో చాలామంది ప‌డుకునే ముందు భోజ‌నం చేస్తార‌ని.. ఆ అల‌వాటే వారి ఆరోగ్య స‌మ‌స్య‌ల‌కు ప్ర‌ధాన కార‌ణ‌మ‌న్నారు.

టీవీ చూస్తూ స్నాక్స్ తిన‌టంతో ప్ర‌మాదం మ‌రింత ఎక్కువ అవుతుంద‌న్న విష‌యాన్ని వెల్ల‌డించారు. రోజంతా కూర్చొని ప‌ని చేసే వారు తోటి ఉద్యోగుల‌తో మాట్లాడ‌టానికో.. మీటింగ్స్ లో పాల్గొన‌టానికి వీలుగా అటూ ఇటూ తిరుగుతుంటార‌ని.. దీంతో శ‌రీరానికి వ్యాయామం అందుతుంద‌ని పేర్కొంది. సో.. అదే ప‌నిగా గంట‌ల త‌ర‌బ‌డి కూర్చొని టీవీ చూడ‌టంతో ఆరోగ్యానికి మ‌స్తు డేంజ‌ర్ అని తేల్చింది. టీవీ చూసే అల‌వాటు ఉంటే.. కాస్త మార్చుకుంటే మంచిది. జ‌రా.. ఆలోచించండి.
Tags:    

Similar News