ఉస్మానియాను ముంచెత్తిన వరదనీరు.. కొట్టుకుపోయిన పీపీఈ కిట్స్

Update: 2020-07-16 06:45 GMT
తెలంగాణలో కరోనాను నియంత్రించడంలో.. వసతులు కల్పించడంలో టీఆర్ఎస్ సర్కార్ ఘోరంగా విఫలమైందనే విమర్శలు చెలరేగుతున్న వేళ మరో ఉపద్రవం.. ఈ వర్షకాలంలో హైదరాబాద్ రోడ్ల గురించి చెప్పక్కర్లేదు. చిన్న వానకే అంతా మునిగిపోతుంది. అల్పపీడనం ద్రోణి వల్ల హైదరాబాద్ లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రిని వరదనీరు ముంచేసింది. అందులో డ్రైనేజీ నీరు కలిసి పొంగి పొర్లడంతో వాటిలో కరోనా వేళ వైద్యులకు సేవలందించడంలో కీలకమైన పీపీఈ కిట్లు కొట్టుకుపోయాయి. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో విలువైన ఈ కిట్లు మురుగునీటి పాలవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి..

దేశవ్యాప్తంగా ఇప్పుడు కరోనా రోగులకు చికిత్సలో వైద్యులకు శ్రీరామ రక్ష పీపీఈ కిట్స్. పైగా తెలంగాణలో పీపీఈ కిట్స్ కొరత అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కొందరు వైద్యులు ఆరోపించారు. అలాంటి జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన వీటిని వరదనీటిలో కొట్టుకుపోతున్నా పట్టించుకోకపోవడం దారుణంగా ఉంది. ఉస్మానియా ఆస్పత్రిలో వరద ధాటికి పీపీఈ కిట్స్ కొట్టుకుపోతున్న వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది.

ఉస్మానియా ఆస్పత్రి వందేళ్ల నాటి పురాతన భవనం.. దీంతో ఈ వర్షానికి పెచ్చులు ఊడిపోతున్నాయి. వరదనీరు, మురికి నీరు కలిసి ఉస్మానియాలోకి ముంచెత్తడంతో రోగులు, వైద్యులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఆస్పత్రిలో మోకాళ్లలోతు నీళ్లు చేరడంతో రోగులు జంకారు. ఓ వైపు కరోనా.. మరో వైపు సీజనల్ వ్యాధులు.. ఇప్పుడు వానలతో పరిస్థితి అల్లకల్లోలంగా మారింది.
Full ViewFull View
Tags:    

Similar News