ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి రాజుకోంటోంది. మరో నాలుగు నెలల్లోనే లోక్ సభకు, శాసనసభకు కూడా ఎన్నికలు వస్తూండడంతో రాజకీయ పార్టీల్లో సందడి ప్రారంభమైంది. అన్ని పార్టీల నుంచి టిక్కట్లు ఆశిస్తున్న వారు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అధికార తెలుగుదేశం పార్టీలో సిట్టింగులను మారుస్తారనే ప్రచారం ఎక్కువగా ఉంది. అయితే ప్రతిపక్ష వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఈ సారి గతం కంటే భిన్నంగా టిక్కట్ల పంపిణీ ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో యువతకు, మహిళలకు వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తారని అంటున్నారు. పాదయాత్రలో భాగంగా ప్రజల నుంచి వేలాది వినతి పత్రాలు అందుకున్న జగన్ వారి ఆకాంక్షలకు అనుగుణంగానే అభ్యర్ధుల ఎంపికను కూడా చేపడతారని అంటున్నారు. గతంలో పోటీ చేసి ఓటమి పాలైన వారిలో కొందరిని మార్చే అవకాశాలున్నాయంటున్నారు. ఇక వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సిట్టింగులను మాత్రం మార్చరని అంటున్నారు. వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ నుంచి విజయం సాధించి తర్వాత అధికార తెలుగుదేశం పార్టీలో చేరిన వారి నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్ధులను నిలబెట్టాలని అధిష్టానం భావిస్తోంది.
ఈ నియోజకవర్గాల్లో తిరిగి విజయం సాధించడమే లక్ష్యంగా పని చేయాలని పార్టీ శ్రేణులకు జగన్ గట్టిగా చెప్పినట్లు సమాచారం. ఇక్కడ విజయం సాధించడం ద్వారా పార్టీ ఫిరాయింపుదారులకు గుణపాఠం చెప్పినట్లు అవుతుందని అంటున్నారు. ఈసారి ఎన్నికల్లో యువతకు, మహిళలకు, మైనార్టీలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని జగన్ భావిస్తున్నారు. అలాగే విద్యావంతులను కూడా ఎంపిక చేసి వారిని పోటీలో నిలపాలన్నది జగన్ ఉద్దేశ్యంగా పార్టీ నాయకులు చెబుతున్నారు. తాను చేసిన ప్రజా సంకల్ప యాత్రలో తనను కలిసిన వారి నుంచి అందుకున్న వినతులను పరిశీలించి వాటికి అనుగుణంగా పార్టీ మేనిఫొస్టోను రూపొందించాలని కూడా జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ వినతుల్లో ఎక్కువ భాగం ప్రజల కష్టాలు, ఆకాంక్షలే ఉన్నాయని, అందుకే మేనిఫెస్టోలో వీటికి ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ సీనియర్ నాయకులకు జగన్ సూచించినట్లు చెబుతున్నారు. ఇప్పటికే పార్టీలో కొందరు మేనిఫెస్టో రూపకల్పనపై ద్రష్టి సారించారంటున్నారు. పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలపై కూడా స్పష్టత ఉండాలని, వాటిని కూడా మేనిఫెస్టోలో పొందుపరచాలని జగన్ పేర్కొన్నట్లు చెబుతున్నారు. మొత్తానికి రానున్న ఎన్నికలకు వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వ సన్నాహాలు చేస్తు పగడ్బందీ పథకంతో ముందుకు వెళ్తోందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
Full View