యుద్ధనౌక కావాలంటున్న చంద్రబాబు..

Update: 2015-07-09 07:16 GMT
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి యుద్ధ నౌక కావాలట... చంద్రబాబు ఇప్పటికే దీనికోసం కేంద్ర ప్రభుత్వానికి లెటర్‌ కూడా రాశారు... అయితే.. ఇది చంద్రబాబు ఎవరితోనూ యుద్ధం చేయడానికీ కాదు... కొత్తగా కొనితెచ్చి ఇవ్వాల్సింది కూడా కాదు... ఇప్పటికే ఏపీలో సేవలందించి జీవిత కాలం ముగిసిన యుద్ధనౌకను పర్యాటకంగా ఉపయోగించుకునేందుకు వీలుగా తమకు ఇచ్చేయమని చంద్రబాబు కోరుతున్నారు.అదీ సంగతి.

    దేశంలో 30 ఏళ్ల పాటు సేవలందించిన ఐఎన్‌ఎస్‌ విరాట్‌ యుద్ధ నౌక జీవితకాలం 2016తో పూర్తవుతుంది.... యుద్దనౌకలంటే చాలా కీలకమైనవి కాబట్టి కార్లు, బస్సుల్లా టైమయిపోయినా వాడే పరిస్థితి ఉండదు.. కాలం చెల్లినవి నిర్మొహమాటంగా పక్కనపెట్టేస్తారు. ఇప్పుడు విరాట్‌ను కూడా పక్కనపెడతారు. అంతేకాదు.. తుక్కుగానూ మార్చేస్తారు. గతంలో ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ విషయంలో ఇలాగే జరిగింది. దాన్ని 1997లో తుక్కుగా మార్చేశారు. ఇవన్నీ తెలిసే చంద్రబాబు దాన్ని వృథా చేసే బదులు తమకు ఇచ్చేస్తే పర్యాటకంగా ఉపయోగించుకుంటామని కేంద్రాన్ని కోరారు. కొత్త రాష్ట్రం ఏపీలో పర్యాటకాభివృద్ది కోసం చంద్రబాబు తపిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఆయన దీన్ని కాకినాడ తీరంలో నిలిపి తేలియాడే మ్యూజియంగా మలచాలన్న ఆలోచనలో ఉన్నారు. విశాఖలో ఓ సబ్‌మెరైన్‌ను ఇలాగే మ్యూజియంలా వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు విరాట్‌ ను కూడా ఇలాగే మ్యూజియంగా మార్చి పర్యాటకులను ఆకట్టుకోవాలన్నది చంద్రబాబు ఆలోచన. కేంద్రంకూడా ఈ విషయంలో సహకరిస్తుందనే బాబు అంటున్నారు. మొత్తానికి చంద్రబాబు బుర్రేబుర్ర.


Tags:    

Similar News