రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ చర్చ జోరుగా సాగుతోంది. మరో ఏడాదిన్నరలో తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలు వున్నాయి. అదేవిధంగా రెండేళ్లలో ఏపీలోనూ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు ఒక వింత ప్రచారం ప్రారంభించారనే కథనాలు వస్తున్నాయి. ఇంకేముంది.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ.. అధికార పార్టీ నేతలు.. ఆయా పార్టీలపై విరక్తి పుట్టి.. త్వరలోనే మా బీజేపీలో చేరిపోతున్నారు.. అని బీజేపీ నేతలు సోషల్ మీడియాలో ప్రచారం పదును పెంచారు. వచ్చే నాయకులు రావొచ్చు.. ద్వారాలు తెరిచే ఉన్నాయని.. వారు చెబుతున్నారట.
అంతేకాదు.. వచ్చే వారు ఎలాంటి నాయకులు అయినా.. తాము అడ్డు పెట్టేది కూడా లేదని అంటున్నారు. దీంతో రెండు రాష్ట్రాల్లో నూ బీజేపీ నేతల వ్యవహార శైలి ఆసక్తిగా.. చర్చకు దారితీసింది.ఓకే.. ఇటు తెలంగాణలో అయినా.. అటు ఏపీలో అయినా.. అధికార పార్టీల నేతల్లో కొంత మేరకు అసంతృప్తి ఉన్న మాట వాస్తవమే. తమకు పదవులు దక్కడం లేదనో.. లేక.. అధినాయ కత్వం తమను పట్టించుకోవడం లేదనో.. రెండు అధికార పార్టీల్లోనూ.. నాయకులు ఒకింత గుస్సాగానే ఉన్నారని తెలుస్తోంది. అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్ దక్కుతుందో లేదో అని అనుకుంటున్న నాయకులు కూడా ఉన్నారని చెబుతున్నారు.
ఇలాంటి నాయకులు పక్క చూపులు చూస్తున్న మాట వాస్తవమేనని పరిశీలకులు కూడా చెబుతున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని కమల దళం.. ఇంకేముంది.. మా పార్టీ పుంజుకుంటుంది.. వచ్చే నేతలకు వరసలు కట్టం డి.. లైన్లు పెట్టండి.. అంటూ.. తమ వందిమాగధులకు ఆదేశాలు సైతం జారీ చేస్తున్నారట. నిజానికి ఇది ఎంత వరకు నిజం? అనేది సామాన్యుడి ప్రశ్న. ఎందుకంటే.. ఎవరైనా.. పెట్టే అమ్మ దగ్గరకు వెళ్తారు.. కానీ, ఒట్టిపోయిన అమ్మదగ్గరకు వెళ్లరు కదా?! అంటున్నారు. ఎందుకంటే.. రెండు రాష్ట్రాల్లోనూ అధికారంలోకి వచ్చే యాలని.. వచ్చేస్తామని చెబుతున్న ఇదే బీజేపీ ఈ రెండు తెలుగురాష్ట్రాలకు ఏం చేసిందనేది కీలక ప్రశ్న.
ఏపీలో కానీ, తెలంగాణలో కానీ.. బీజేపీ వాళ్లు ఎవరో వస్తున్నారు.. వస్తారు.. పార్టీని బలోపేతం చేస్తారు.. అని.. పగటి కలలు కంటున్నారని.. విశ్లేషకులు చెబుతున్నారు. ఏపీలో 2 శాతం ఉన్న ఓటు బ్యాంకు.. ఇప్పుడు ఏకంగా 18 శాతానికి పెరిగిందని.. అలేగే.. తెలంగాణలో 6 శాతం నుంచి ఏకంగా 10 శాతం వరకు పుంజుకుంటుందని.. లెక్కలు వేసుకుంటున్నారే తప్ప.. క్షేత్రస్థా యిలో పరిస్థితిని మాత్రం.. ప్రజలు ఏమనుకుంటున్నారో.. మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదనే వాదన బలంగా వినిపిస్తుండ డం గమనార్హం. నిజానికి ఏ పార్టీ అయినా.. అధికారంలోకి రావాలంటే.. ఆ పార్టీ ప్రజలకు కానీ.. రాష్ట్రానికి కానీ.. ఏం చేసిందనే ప్రశ్న.. ప్రాధమికంగా తెరమీదికి వస్తుంది.
ఇలా చూసుకుంటే.. రెండు తెలుగు రాష్ట్రాలకు.. బీజేపీ నేతలు ఏం చేశారు? అని మేధావులు సైతం ప్రశ్నిస్తున్నారు. ఈ రెండు రాష్ట్రాలకు అపారమైన నిధులు ఇస్తున్నామని.. అభివృద్దిలో పరుగులు పెట్టిస్తున్నామని.. అంతా మోడీ చలవేనని.. చెబుతున్న బీజేపీ నాయకులు.. ఇతర రాష్ట్రాలకు ఇస్తున్నట్టే కదా.. ఈ రెండు రాష్ట్రాలకు ఇస్తున్నదన్న విషయాన్ని ఏమారిస్తే.. ఎలా? అంటూ.. నిలదీస్తున్నారు. ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు సంక్షేమ నిధులు ఇస్తున్నామని.. ఇలా దేశంలో ఎక్కడా ఇవ్వకుండానే.. ఇక్కడే ఇస్తున్నామని.. బిల్డప్ ఇస్తున్నారు. కానీ, వాస్తవానికి.. ఇప్పటి వరకు చూసుకుంటే.. రెండు రాష్ట్రాలు ఏర్పడి 8 వసంతాలు పూర్తయ్యాయి.
ఈ ఎనిమిదేళ్లలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ.. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను తూచ తప్పకుండా అమలు చేయాల్సిన బాధ్యత కూడా పార్టీదే. కాని.. ఇప్పటి వరకు ఈ విభజన చట్టంలోని ఎన్ని అంశాలను నెరవేర్చారు. తెలంగాణకు నేషనల్ ప్రాజెక్టులు ఒక్కటంటే ఒక్కటైనా ఇచ్చారా? ఒక్క సెంట్రల్ గవర్నమెంట్ ఫ్యాక్టరీ అయినా.. తెచ్చారా? కనీసం.. కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వండి.. భూములు కూడా కేటాయించామని.. చెబుతున్నా.. చెవినెక్కించుకుంటున్నారా? అంటే.. ఏదీ లేదు. అయినా.. కూడా పార్టీ బలంగా ఉందని.. బలోపేతం అవుతుందని.. మీరంతా వచ్చేయండని.. సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నంత మాత్రాన ఏం ఒరుగుతుందని అంటున్నారు మేధావులు.
ఇక, ఏపీ విషయానికి వచ్చినా.. పోలవరం ప్రాజెక్టుకు నిధులు లేవు. వెనుక బడిన జిల్లాలకు నిధులు లేవు. వేరే రాష్ట్రాలకు ఎలా అయితే.. ఇస్తున్నారో.. అంతే ఇస్తున్నారు. అంతేకాదు.. నిజానికి దక్షిణాదిలోనే జీఎస్టీ వసూళ్లు ఎక్కువ. అందునా.. ఏపీ, తెలంగాణ ల వాటానే ఎక్కువ. కానీ, ఇక్కడ నుంచి తీసుకున్న ఈ సొమ్మును కూడా.. ఇతర రాష్ట్రాలకు కేటాయిస్తున్నారు కానీ, ఇక్కడ ఎంత ఖర్చు చేస్తున్నారు? పైగా సొమ్ములు అడిగితే.. అప్పులు చేసుకోండని.. ఉచిత సలహాలు పడేస్తున్నారని మేదావులు చెబుతున్నారు.
ఇంత జరుగుతున్నా.. బీజేపీ నాయకులు రాష్ట్రాల అభివృద్ధిని పట్టించుకోవడంలేదు. విభజన చట్టంలో పేర్కొన్న నిధులు , సంస్థలను తీసుకురావడం లేదు. కానీ అధికారం మాత్రం కావాలి. అందుకే వారు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఈ పరిణామాలను గమనిస్తున్న టీఆర్ ఎస్, వైసీపీ నాయకులు.. ఎన్నికల సమయానికి ఏదైనాఆ మార్పు కోరుకుంటే.. తాము కాంగ్రెస్‌లోకి అయినా.. వెళ్తాం కానీ.. బీజేపీలో ఏం చూసి చేరాలని నిలదీస్తున్నారు. కాంగ్రెస్‌లో చేరేందుకుకొన్ని సానుకూల పరిణామాలు ఉన్నాయని కూడా చెబుతున్నారు.
తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ కాబట్టి.. ధైర్యంగా ప్రజల్లోకి వెళ్తామని అంటున్నారు. ఏపీలో రెడ్ల కు వాల్యూ ఇవ్వడమే కాకుండా.. రాజకీయంగా వారి ఎదుగుదలకు కారణమైంది .. పదవులు ఇచ్చింది కూడా కాంగ్రెస్. సో... ఆ పార్టీలోకి వెళ్లినా.. నష్టం ఉండదని అంటున్నారు. అంతేకాదు.. వైఎస్సార్.. అమలు చేసిన పథకాలను కాంగ్రెస్ ఇచ్చిననవే కాబట్టి.. ఆ పార్టీకి జై కొట్టినా.. కష్టమో.. అక్కడే తేల్చుకుంటామని.. అంతే తప్ప. ఏం చూసి బీజేపీలోకి చేరాలని ప్రశ్నిస్తున్నారు.