తిట్టటమే కానీ తిట్టించుకోవటం అలవాటు లేని వారికి.. ఘాటు మాటల్ని పడాల్సి రావటానికి మించిన ఇబ్బంది మరొకటి ఉండదు. ఉద్యమ వేళ మొదలు ఇప్పటివరకు విపక్షాలపై విరుచుకుపడే విషయంలో టీఆర్ఎస్ ట్రాక్ రికార్డును టచ్ చేసే వారే లేరు. రేవంత్.. ఉత్తమ్.. భట్టి లాంటి వారు కొందరున్నా.. ఒక పరిమితి మాత్రమే. కానీ.. ఎప్పుడైతే బండి సీన్లోకి వచ్చారో.. అప్పటి నుంచి తెలంగాణలో మొత్తం బొమ్మే మారిపోయింది. కేసీఆర్ ను గట్టిగా ఏమైనా అనాలంటే సంకోచం ఉండేది. అందుకు భిన్నంగా.. తోచిన రీతిలో అనేసే వెసులుబాటు వచ్చేసింది.
నోటికి వచ్చినట్లు అనేసే బండికి ఎలా బదులివ్వాలో అర్థం కాని పరిస్థితుల్లో గులాబీ నేతలు ఉండిపోయారు. దీనికి తోడు.. వరుసగా ఎదురైన రెండు ఓటములతో గులాబీ నేతలు మరికాస్త కుంగిపోయారు. ఇలాంటివేళలో.. తాజాగా వెల్లడైన రెండు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కొండంత బలాన్ని ఇచ్చింది. మరోవైపు సాగర్ ఉప ఎన్నికలోనూ గులాబీ కారే దూసుకెళుతుందన్నమాట బలంగా వినిపిస్తోంది. ఈ క్రమంలో తమపై విమర్శలు చేసే విపక్షాలపై విరుచుకుపడుతున్నారు మంత్రి కేటీఆర్.
ఇప్పటివరకు ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తున్న తీరుకు భిన్నంగా.. విపక్షాల మాదిరే నోటికి పని చెబుతామని క్లారిటీ ఇచ్చేశారు కేటీఆర్. ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి బీజేపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని.. ఇకపై మాట్లాడితే ఒప్పుకునేది లేదన్నారు. ఏమీ చేయలేని సన్నాసులు ఎగిరెగిరి పడుతుంటే.. అన్ని పనులు చేస్తున్న తాము మరెన్ని మాట్లాడాలన్న కేటీఆర్.. తాము కూడా మోడీ.. అమిత్ షాలను మాటలతో ఉతికి ఆరేస్తామన్నారు.
శిశుపాలుడిని కూడా వంద తప్పుల కంటే ఎక్కువ క్షమించలేదని.. బీజేపీ నేతలకు తానిచ్చే చివరి హెచ్చరిక ఇదేనంటూ తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించారు. ఎవడీ బండి సంజయ్? తెలంగాణ రాష్ట్రం రాకపోతే వీరికి ఉనికి ఉండేదా? పదవులు దక్కేవా? బీజేపీ నేతలు నోటికి వచ్చినట్లు బూతులు మాట్లాడుతున్నారు. మాకు అలాంటి పదాలు వాడటం రాక కాదన్న కేటీఆర్.. తాము కానీ వాడటం మొదలు పెడితే తమ కంటే బాగా ఎవరూ వాడలేరన్నారు. తెలంగాణను సాధించిన నాయకుడన్న సోయి లేని దౌర్భాగ్యుల్లా మాట్లాడుతున్నారంటూ విరుచుకుపడ్డారు. మరి.. ఇంత ఘాటుగా రియాక్టు అయిన కేటీఆర్ కు.. బండి అండ్ కో మరెలా కౌంటర్ ఇస్తారో చూడాలి.