ఐసోలేషన్‌ కేంద్రంలో పెళ్లి !

Update: 2021-05-27 11:30 GMT
దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభణ తో తెలుగు రాష్ట్రాల్లో కూడా లాక్ డౌన్ , కర్ఫ్యూ అమలు అవుతోంది. కరోనా మహమ్మారి కట్టడి కోసం ఈ లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారు. అలాగే వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తున్నారు. ఇక ఈ లాక్ డౌన్ సమయంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా కొద్ది సమయం పాటు కరోనా నియమాల నుండి మినహాయింపు ఇచ్చారు. దీనితో ఈ సమయంలోనే ఎదో వచ్చిన వారితో కొందరు పెళ్లిళ్లు కానిచ్చేస్తున్నారు. అయితే , వింతగా ఉంటుందనో , లేక మరేవిధంగా ఆలోచించారో తెలియదు కానీ ఏకంగా ఐసోలేషన్ కేంద్రం లోనే పెళ్లి చేసుకున్నారు. అయితే , పెళ్ళికొడుకు , పెళ్లి కూతురు ఐసోలేషన్ లో ఉందేమో అనుకునేరు అది కూడా కాదు. అసలు ఐసోలేషన్ లో పెళ్లి చేయడానికి గల అసలు కారణం ఏమిటంటే ..    

వివరాల్లోకి వెళ్తే .. కరోనా వైరస్ బాధితులకు గ్రామస్థాయిలో వసతి కల్పించి మెరుగైన వైద్యసేవలు అందించాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్న ఐసోలేషన్‌ కేంద్రంలో వివాహం జరిపించారు. అయితే, ఆ విషయాన్ని అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో కరప లోని చిరంజీవి కల్యాణ మండపంలో దిగువ భాగంలో ఇటీవల ఐసోలేషన్‌ కేంద్రం ఏర్పాటు చేశారు. బాధితులు ఉండేందుకు అవసరమైన మంచాలు ఇతర ఏర్పాట్లు చేశారు. ఈ కేంద్రం పైఅంతస్తులో బుధవారం రాత్రి వివాహ వేడుక జరిగింది. ఐసోలేషన్‌ కేంద్రంలో కొవిడ్‌ బాధితులు ఎవరూ లేకపోవడంతో కొంత ఊరటనిచ్చే అంశం. దీనిపై ఆర్డీవో చిన్నికృష్ణను అడిగితే ..  ఆ విషయం తమ దృష్టికి రాలేదని, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
Tags:    

Similar News