ప్రధాని మోడీని పొగిడేసింది కాంగ్రెస్ పార్టీ. నిద్రలోనూ ప్రధానిని పొగిడేందుకు ఇష్టపడని ఆ పార్టీ.. అందుకు భిన్నంగా సోషల్ మీడియాలో ప్రముఖంగా 'వెల్ డన్ మోడీ' అంటూ పొగిడేయటానికి కారణం ఏమిటి? అన్నది ప్రశ్న. దానికి సమాధానం ఆ పార్టీనే చెప్పింది. సీబీఎస్ఈ పరీక్షల్ని వాయిదా వేస్తున్నట్లుగా కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ స్వాగతించింది. ఈ సందర్భంగా ట్విటర్ లో.. 'వెల్ డన్ మోడీ' అంటూ పొగిడేసింది.
ప్రతి పొగడ్తకు ఎంతో కొంత ఖర్చు ఉన్నట్లు.. మోడీని ఇంతలా పొగడటం వెనుక కాంగ్రెస్ లెక్కలు కాంగ్రెస్ కు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా నిర్వహించే సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షల్ని రద్దు చేయటం వెనుక కాంగ్రెస్ ఒత్తిడి ఉంది. కొద్ది రోజులుగా పరీక్షల్ని నిర్వహించొద్దని.. పిల్లల ఆరోగ్యంతో చెలగాటం ఆడొద్దని కోరుతోంది. కాంగ్రెస్ అధినాయకత్వం పదే పదే ప్రస్తావించిన అంశంపై తాజాగా కేంద్ర ప్రభుత్వం.. వారు సూచన చేసినట్లే పరీక్షల్నిరద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవటంతో.. ఆ క్రెడిట్ తన ఖాతాలో వేసుకోవాలని తపిస్తోంది.
ఈ నేపథ్యంలో మోడీని వెల్ డన్ అంటూ పొగిడేస్తూ.. దానికి అసలు కారణం ఏమిటన్న విషయాన్ని ప్రజల మనసుల్లోకి సూటిగా వెళ్లే ప్రయత్నం చేసింది. మోడీ తమ సలహాను పాటించారని.. దేశ హితం కోసం రాహుల్.. ప్రియాంకలు ఎంత దూరమైనా ప్రయాణిస్తారని.. ప్రజలకు మెరుగైన భవిష్యత్తుకోసం కలిసి చేయటం ప్రజాస్వామ్యంలో ప్రాథమిక విధిగా కాంగ్రెస్ పేర్కొంది.
అహంకారం కంటే దేశ శ్రేయస్సుకే పెద్ద పీట వేసినట్లుగా కాంగ్రెస్ తన ట్వీట్ లో పేర్కొంది. షెడ్యూల్ ప్రకారం మే నాలుగు నుంచి పదో తరగతి పరీక్షలు జరగాల్సి ఉంది. దేశంలో కేసుల తీవ్రత అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో.. పరీక్షలు నిర్వహిస్తే మరింత ప్రమాదమన్న సూచనను పలువురు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యా శాఖా మంత్రి రమేష్ పోఖ్రియాల్.. ఇతరసీనియర్ అధికారులు ప్రధానిలో సమావేశయ్యారు. చివరకు పదో తరగతి పరీక్షల్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో ప్లస్ టూ పరీక్షల కోసం కొత్త షెడ్యూల్ ను ప్రకటిస్తామని పేర్కొన్నారు. దీంతో.. ఈ ఘనత తమదేనన్న విషయాన్ని గుర్తు చేసే క్రమంలో కాంగ్రెస్ ట్వీట్ చేసి.. వెల్ డన్ మోడీ.. మీరు మా మాట విన్నారంటూ.. తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.