తిమింగలం వీర్యం రూ. 8 కోట్లు ...రాష్ట్ర చరిత్రలో తోలి కేసు !

Update: 2021-06-10 05:12 GMT
అంతర్జాతీయ మార్కెట్ లో కోట్లు విలువ చేసే తిమింగలం వీర్యంను బెంగళూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక చరిత్రలో మొదటిసారి అంగర్ గ్రీస్ స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను అరెస్టు చెయ్యడం కలకలం రేపింది. తిమింగలం వీర్యం(అంబర్ గ్రీస్) కు అంతర్జాతీయ మార్కెట్ లో భారీ డిమాండ్ ఉంది. అక్రమంగా అంబర్ గ్రీస్ విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు అయ్యింది. బెంగళూరులోని కాడుగొండనహళ్ళి పోలీస్ స్టేషన్ పరిదిలోని ఎంఆర్ కే టెంట్ హౌస్ సమీపంలో అంగర్ గ్రీస్ విక్రయించడానికి ప్రయత్నిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. కోట్ల రూపాయల విలువైన అంగర్ గ్రీస్ చేతులు మారుతున్న సమయంలో ఎంట్రీ ఇచ్చిన పోలీసులు బెంగళూరులో నివాసం ఉంటున్న తజ్ముల్ షాషా, సలీం పాషా, రఫీవుల్లా, నాసీర్ పాషా అనే నిందితులను అరెస్టు చేశారు. రూ. 8 కోట్ల విలువైన అంబర్ గ్రీస్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 నిందితులు అక్రమంగా అంబర్ గ్రీస్ విక్రయించడానికి ప్రయత్నిస్తున్నారని అంగీకరించారని పోలీసులు చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్ లో అంబర్ గ్రీస్ ఒక కేజీ రూ. 1. 70 కోట్లు ఉంటుందని పోలీసు అధికారులు అన్నారు. అంతర్జాతీయంగా అంబర్ గ్రీస్ విక్రయించడం నేరమని పోలీసు అధికారులు చెప్పారు. తిమింగలాలు చేపలు తినే సమయంలో దాని వీర్యం బయటకు విసర్జిస్తుందని అధికారులు అంటున్నారు. బ్రెజిల్, జపాన్, ఆస్ట్రేలియా, మెలుకన్ ద్వీపాల్లో తమింగలాలు ఎక్కువగా వాటి వీర్యం విసర్జిస్తుందని. కొన్ని గంటల తరువాత ఆ వీర్యం రాయిలాగా మారిపోయి సముద్రంలోని నీటిలో తేలుతుందని పోలీసు అధికారులు వివరించారు. అంబర్ గ్రీస్ ను ఎక్కువగా ప్రయోగాల కోసం, ఔషదాలు, సుగంధద్రవ్యాలు తయారు చెయ్యడానికి ఉపయోగిస్తారని పోలీసులు చెప్పారు. కర్ణాటక చరిత్రలోనే అంబర్ గ్రీస్ ను విక్రయిస్తున్న వారిని మొదటిసారి అరెస్టు చేశారు. గతంలో కర్ణాటకలో అంబర్ గ్రీస్ కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదు. నిందితులకు భారీ డీల్ మాట్లాడుకోవడానికి స్కెచ్ వేస్తున్న సమయంలో పోలీసులు చాకకచ్యంగా వారిని అరెస్టు చేశారు.
Tags:    

Similar News