క‌న్నాను ప‌క్కన పెట్టేస్తున్నారే...!

Update: 2022-07-14 03:48 GMT
రాష్ట్ర బీజేపీలో ఆస‌క్తిక‌ర విష‌యం తెర‌మీదికి వ‌చ్చింది. కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన కీల‌క నాయ‌కు డు.. మాజీ మంత్రి క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌ను ప‌క్క‌న పెట్టేస్తున్నారా? ఆయ‌న‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదా? అనే సందేహాలు తెర‌మీదికి వ‌స్తున్నాయి. ఎందుకంటే.. పార్టీ అధ్య‌క్షుడిగా ఆయన 2019 ఎన్నిక‌ల్లో ప‌నిచేశారు. అయితే..పార్టీని అధికారంలోకి తీసుకురాలేక పోయారు. ఏకంగా అప్ప‌టి ఎన్నిక‌ల్లో పార్ల‌మెం టుకు పోటీ చేసి.. ఆయ‌న ఓట‌మి పాల‌య్యారు.

అప్ప‌ట్లో త‌ను అలా చేయ‌డం వ‌ల్ల న‌ష్ట‌పోయాన‌ని ఆయ‌న‌ చెప్పుకొచ్చారు. ఇక‌, కొన్నాళ్లకు ఆయ‌న‌ను చీఫ్ పోస్టు నుంచి త‌ప్పించారు. అప్ప‌టికీ.. ఆయ‌న కొన్నాళ్ల‌పాటు దూకుడుగానే ఉన్నారు. అయితే.. ఇటీవ‌ల కాలంలో ఆయ‌న‌కు పార్టీ ప‌రంగా ప్రాధాన్యం త‌గ్గుతూ వ‌చ్చింద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

ప్ర‌స్తుతం జాతీయ కార్య‌ద‌ర్శి హోదాలో ఉన్న‌ప్ప‌టికీ..ఆయ‌న‌కు ప్రాధాన్యం లేకుండా పోయింద‌నే వాద‌న వినిపి స్తోంది. మ‌రోవైపు.. నేత‌ల‌తోనూ ఇటీవ‌ల కాలంలో స‌ఖ్య‌తా చాలా వ‌ర‌కు త‌గ్గిపోయింది.

గ‌తంలో ఏ కార్య‌క్ర‌మం జ‌రిగినా క‌న్నాను పిలిచేవారు. ఆయ‌న వ‌చ్చే వ‌ర‌కు కూడా ఆగిన సంద‌ర్భాలు కూ డా ఉన్నాయి. కానీ, ఇప్పుడు ఆయ‌న‌కు ఆహ్వానం కూడా అంద‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ఇటీవ‌ల  ప‌శ్చిమ గోదావరి జిల్లాలో జ‌రిగిన మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు కార్య‌క్ర‌మానికి కానీ, తాజాగా రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ముర్ము విజ‌య‌వాడ వ‌చ్చిన సంద‌ర్భంలో కానీ, ఆయ‌న‌కు ఎలాంటి ఆహ్వానం అంద‌లేద‌ని క‌న్నా అనుచ‌రులు చెబుతున్నారు.

దీనిపై రాష్ట్ర నాయ‌కులు కానీ, అటు జాతీయ నాయ‌కులు కానీ. పెద‌వి విప్ప‌కపోవ‌డం గ‌మ‌నార్హం. ఇదిలావుంటే, క‌న్నా కూడా జ‌న‌సేన పార్టీవైపు చూస్తున్నార‌ని కొన్నాళ్లుగా రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఆయ‌న జ‌న‌సేన త‌ర‌ఫున పోటీ చేయ‌నున్నార‌ని, దీనికి సంబంధించి చ‌ర్చ‌లు కూడా జ‌రుగుతున్నాయ‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే బీజేపీ ఆయ‌న‌ను ప క్క‌న పెట్టిందా? అనే చ‌ర్చ జ‌రుగుతోంది.
Tags:    

Similar News