చైనాలోని వూహాన్ లో పుట్టిన కరోనా(కోవిడ్-19) వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని బెంబెలెత్తిస్తోంది. కరోనా వైరస్ ప్రస్తుతం 180కు పైగా దేశాలకు పాకింది. తాజాగా ఇండియాలోనూ కరోనా మహమ్మరి విజృంభిస్తుందడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా నివారణకు ఇప్పటికే కేంద్రం 21రోజుల లాక్ డౌన్ చేపట్టిన సంగతి తెల్సిందే. ఇదిలా ఉంటే ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తున్న కరోనా మహమ్మరికి స్మగ్లింక్ లింకు ఉన్నట్లు తెలుస్తోంది. చైనాలోకి అక్రమంగా రవాణా చేసిన పాంగోలిన్స్ కు ప్రస్తుతం విజృంభిస్తున్న కరోనా(కోవిడ్-19) వైరస్ కు దగ్గరి సంబంధం ఉన్నట్లు నేచర్ జర్నల్ ఓ అధ్యయనాన్ని ప్రచురించింది.
పాంగోలిన్స్.. చిన్న చీమలను తిని జీవించే క్షీరదం. దీనిలో ప్రాణాంతక వైరస్ మూలాలు ఉన్నాయని.. ప్రస్తుత కోవిడ్-19వైరస్ ప్రబలేందుకు ఇవి ఊతమిస్తున్నట్లు పేర్కొంది. పాంగోలిన్లు కరోనా వైరస్ ల రెండవ క్షీరద వాహకాలు అని ‘ద యూనివర్సిటీ ఆఫ్ హంకాంగ్’ కూడా పేర్కొంది. అదేవిధంగా సార్స్ కోవిడ్-2 అనే మహమ్మారికి గబ్బిలాలు కావచ్చని పరిశోధకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుత మహమ్మారికి వ్యాప్తి వెనుక కారణమయ్యేది జంతువులు అనడానికి కచ్చితంగా చెప్పడానికి సరైన ఆధారాలు లేవని పరిశోధకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ అధ్యయనంలో గతంలో దక్షిణ చైనాలో అక్రమంగా సరఫరా అవుతుతూ పట్టుబడిన పాంగోలిన్ల నుంచి తీసిన శాంపిల్స్ విశ్లేషించారు. జంతువుల్లో సార్స్ కోవిడ్-2 సంబంధిత కరోనా వైరస్‌లు ఉన్నట్లు తేలింది. కరోనా వైరస్‌ల జీవావరణ శాస్త్రంలో పాంగోలిన్లకు ముఖ్యమైన పాత్ర ఉందని పరిశోధనలో వెల్లడైంది. అయినప్పటికీ సార్స్ కోవిడ్-2ను మానవులకు వ్యాప్తి చేయడంలో పాంగోలిన్లను నేరుగా సూచించలేమని పరిశోధనలు చెబుతున్నారు.
కరోనా వైరస్‌ల ఆవిర్భావంలో మానవులకు సోకే అవకాశం ఉన్న వాటి పాత్రను అర్థం చేసుకోవడానికి పాంగోలిన్లపై మరింత పర్యవేక్షణ అవసరమని పరిశోధకులు సూచిస్తున్నారు. కరోనా వైరస్‌ల వాహకాలుగా పాంగోలిన్లను పరిగణించాలని సూచిస్తుంది. వైరస్ వ్యాప్తిని నివారించడానికి తేమతో కూడిన మార్కెట్ల నుంచి వీటిని తొలగించాలని పరిశోధకులు సూచిస్తున్నారు. కరోనా మహమ్మరికి వాహనంగా ఉన్న పాంగోలిన్ల అమ్మకాన్ని వన్యప్రాణి మార్కెట్లలో ఖచ్చితంగా నిషేధించాలని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.