గతానికి భిన్నంగా ఇటీవల కాలం లో వివాహేతర సంబంధాలు అంతకంతకూ ఎక్కువ కావటం.. వాటితో చోటు చేసుకునే నేరాల సంఖ్య పెరుగుతోంది. వీటితో పాటు.. భార్యలు కొందరు యువకుల మాటల ప్రభావానికి లోనై.. భర్తను.. పిల్లల్ని విడిచి పెట్టి వెళ్లిపోతున్న ఉదంతాలు ఎక్కువ అవుతున్నాయి. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి ఉమ్మడి అనంతపురం జిల్లా లో చోటు చేసుకుంది.
ఈ ఉదంతం పై బాధితుడిగా మారిన భర్త.. అనూహ్యంగా వ్యవహరించారు. రోటీన్ కు భిన్నమైన తరహా లో రియాక్టు అయి..తన భార్య ను మాయమాటలతో లేవదీసుకెళ్లిన వైనం పై కొత్త తరహా నిరసన ను చేపట్టాడు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది. అసలేం జరిగిందంటే.. శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలం లోని క్యాంపురం గ్రామానికి చెందిన అంజి.. నేత్రావతి ఇద్దరు దంపతులు.
కొంతకాలం క్రితం బెంగళూరు వలస వెళ్లిన ఈ దంపతులు అక్కడే ఒక తోట లో కూలి పనులు చేసేవారు. అయితే.. వారి గ్రామానికి చెందిన దివాకర్ కూడా బెంగళూరు లో కూలిపనులు చేసేవాడు. అయితే.. నేత్రావతి పై కన్నేసిన దివాకర్.. ఆమెతో పరిచయాన్ని పెంచుకున్నాడు. తాజాగా ఆమెను లేవదీసుకొని వెళ్లిపోయాడు. దీంతో.. తీవ్ర వేదనకు గురైన అంజి తన సొంతూరుకు వచ్చాడు.
జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యుల కు చెప్పుకొని వేదన చెందాడు. అక్కడి తో ఆగని అతను.. తనకు ఇంత మోసం చేసిన దివాకర్ కు తగిన శిక్ష వేయాలని నిర్ణయించుకున్నాడు. దివాకర్ ఫోటో కు చెప్పుల దండ వేసి.. సైకిల్ పై ఊరేగిస్తూ.. డప్పు వాయిద్యాల మధ్య ఊర్లో ఊరేగించాడు. దివాకర్ ఇంటి ఎదుట చెప్పులు పెట్టి నిరసన తెలిపారు. దివాకర్ చేసిన పని పై ఊర్లోని వారంతా దివాకర్ ఫోటో మీద ఉమ్మేసి తమ నిరసనను తెలిపారు. ఈ ఉదంతం తాజాగా సంచలనంగా మారింది. క్యాంపురం చుట్టుపక్కల గ్రామాల్లో ఈ ఉదంతం హాట్ టాపిక్ గా మారింది.