ఏపీలో వైసీపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న 'గడపగడకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ప్రజలు చుక్కలు చూపించారు. ప్రజల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. తమ సమస్యలపై నాయకులను నిలదీశారు. అనంతపురం జిల్లాలోని ఉరవకొండ నియోజకవర్గంలో తమకు లబ్ధి చేకూరని పథకాలను.. లబ్ధి పొందినట్లు చూపించడంతో నాయకులపై ప్రజలు నిప్పులు చెరిగారు. తూర్పుగోదావరిలో సారా విక్రయాలు కట్టడి చేయకపోతే.. వచ్చే ఎన్నికల్లో ఓటెందుకు వేయాలని ప్రజలు ప్రశ్నించారు. దీంతో వైసీపీ నాయకులు మౌనంగా వెళ్లిపోయారు.
అనంతపురం జిల్లా..జిల్లాలోని ఉరవకొండ మండలంలో తమకు లబ్ధి చేకూరని అంశాలను సైతం కార్డులో పొందుపరిచారని కూడేరు మండలం గొట్కూరుకు చెందిన ప్రతాప్ నాయుడు అనే వ్యక్తి పేర్కొన్నారు.
గ్రామంలో చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి పర్యటిస్తూ ఇంటింటి వద్దకు వెళ్లి.. సంక్షేమ పథకాల లబ్దిని వివరించే ప్రయత్నం చేశారు. కార్డులో పంటల బీమా 3,603 రూపాయలు, మహిళా సంఘాల సున్నా వడ్డీ ద్వారా 3813 రూపాయలు లబ్ధి పొందినట్లు పేర్కొన్నారు.
అయితే, అసలు తమకు బీమానే రాలేదని,.. సున్నా వడ్డీ కూడా 600 రూపాయలు మాత్రమే వచ్చిందని ప్రతాప్ పేర్కొన్నారు. అతని తల్లికి పింఛను రూపంలో రూ.65 వేలు లబ్ధి పొందినట్లు చూపారన్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తరువాత పది ఎకరాల భూమి ఉంటే రేషన్ కార్డును రద్దు చేశారని, పింఛను ఐదారు నెలల కూడా ఇవ్వలేదని.. రూ.65 వేలు ఇచ్చినట్లు పొందుపరచటం ఏమిటని మాజీ ఎమ్మెల్యేను నిలదీయగా, వితండవాదం పనికిరాదంటూ విశ్వేశ్వర రెడ్డి ముందుకు సాగిపోయారు.
తూర్పులో..పిఠాపురంలో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పిఠాపురం ఎమ్మెల్యే పెండైం దొరబాబుకి నిరసన తగిలింది. కొత్తపల్లి మండలం అమీనాబాద్ గ్రామంలో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఏ ఇంటికెళ్లినా మహిళలు సమస్యలతో స్వాగతం పలికారు. రోడ్లు, మురుగు కాలువలు, త్రాగునీరు విద్యుత్ తదితర సమస్యలను విన్నవించారు.
"గత చంద్రబాబు ప్రభుత్వంలో రోడ్లు కాలువలు, విద్యుత్ సదుపాయాలు కల్పించారు. కనీసం మీ ప్రభుత్వంలో వేసిన కాలువల్లో పూడికైనా తొలగించారా" అని మహిళలు ప్రశ్నించారు. ఓ వృద్దురాలు ఎమ్మెల్యే వద్దకు వచ్చి గ్రామంలో విచ్చలవిడిగా సారా విక్రయాలు జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని తెలిపారు. పూర్తిస్థాయిలో సారా కట్టడి చేస్తేనే.. వచ్చే ఎన్నికల్లో మీకు ఓటు వేసేదని.. లేదంటే గ్రామంలో ఒక్కరితో కూడా ఓటు వేయించనని చెప్పారు. దీంతో ఎమ్మెల్యే దొరబాబు.. అక్కడ నుంచి నిష్క్రమించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.