ఒసామా బిన్ లాడెన్ ను చంపినప్పుడు వైట్ హౌస్ లో అసలేం జరిగింది.?

Update: 2023-04-30 11:25 GMT
అల్ ఖైదా అధినేత, ప్రపంచ ఉగ్రవాది అయిన ఒసామా బిన్ లాడెన్‌ను అంతమొందించి నేటికి 12 ఏళ్లు అవుతోంది. లాడెన్ తప్పించుకొని పోవడంతో అతడిని కనుగొని మరీ పాకిస్తాన్ లో అర్ధరాత్రి రహస్య ఆపరేషన్ నిర్వహించి అమెరికా మట్టు బెట్టింది.  పాకిస్తాన్‌లో దాడిని అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా దగ్గరుండి మరీ పర్యవేక్షించారు. బరాక్ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఈ దాడికి సరిగ్గా 12 సంవత్సరాలు అవుతోంది. నాడు లాడెన్ పై దాడిని వైట్ హౌస్ లో కూర్చొని నాటి అధ్యక్షుడు బరాక్ తోపాటు నేటి అధ్యక్షుడు జోబైడెన్ సహా రక్షణ, విదేశాంగ మంత్రులు దగ్గరుండి పర్యవేక్షించారు. వైట్ హౌస్‌లో ఏం జరిగిందన్న దానిపై గతంలో చూడని చిత్రాలను తాజాగా విడుదల చేశారు. అవి వైరల్ అయ్యాయి.  

అధ్యక్షుడు బరాక్ ఒబామా, నాటి దేశ ఉపాధ్యక్షుడు జో బిడెన్, విదేశాంగ కార్యదర్శి హిల్లరీ క్లింటన్ , కీలక సైనిక , పౌర సలహాదారులు ఈ ఆపరేషన్ ను దగ్గరుండి మరీ పర్యవేక్షించారు. ఆ  ఆపరేషన్ చిత్రాలు పంచుకున్నారు. అమెరికా ప్రత్యేక దళాలు మిషన్‌ను నిర్వహించినప్పుడు అప్పటి ఉద్రిక్తతను , లాడెన్ చనిపోయాక చేసుకున్న వేడుకలను చూపిస్తున్నాయి.

సెప్టెంబర్ 11 , 2001న న్యూయార్క్ , వాషింగ్టన్‌లపై దాడి చేసి 3,000 మందికి పైగా చంపిన ఉగ్రవాద నెట్‌వర్క్ అల్-ఖైదాను.. దాని అధినేత బిన్ లాడెన్ ను చంపడమే ధ్యేయంగా అమెరికా స్కెచ్ గీసింది. బిన్ లాడెన్‌ను వెతకడానికి అమెరికా నాడు ఆఫ్ఘనిస్తాన్‌పై దాడి చేసింది. అతను దాదాపు 10 సంవత్సరాల పాటు పట్టుబడకుండా లాడెన్ తప్పించుకున్నాడు. చివరకు పాకిస్తాన్‌లోని అబోటాబాద్‌లోని ఒక ఇంట్లో రహస్యంగా దాక్కున్నట్టు గుర్తించారు.    మే 1 అర్ధరాత్రి లాడెన్ ఇంటిపై దాడి చేసి మరీ చంపేశారు. ఆ తర్వాత దేశాన్ని ఉద్దేశించి ఒబామా చేసిన ప్రసంగించారు.

ఈ ఆపరేషన్ లో ఒబామా, బిడెన్, క్లింటన్ , ఇతర సహాయకులు ఒక చిన్న వైట్ హౌస్ గదిలో కూర్చొని ఈ దాడిని చూస్తున్నారు. "సాయంత్రం 4.05 గంటలకు, ఒబామా , అతని సలహాదారులు లాడెన్ పై దాడి వీడియో ఫీడ్‌ను తీవ్రంగా చూస్తున్నట్లుగా ఆ ఫోటోలు ఉన్నాయి.

2020లో ఒబామా తన జ్ఞాపకాలపై రాసిన పుస్తకంలోనూ లాడెన్ పై దాడి వీడియోలను పంచుకున్నారు. 'ఎ ప్రామిస్డ్ ల్యాండ్‌' పుస్తకంలో దాడిపై జరిగిన చర్చలను వివరించారు. "అధ్యక్షుడిగా నేను తీసుకున్న ప్రతి ప్రధాన నిర్ణయంలో జోబైడెన్ ఉన్నారు. నా స్వంత అంతర్గత చర్చల్లోనూ పాల్గొన్నారు.  ధృధమైన మానసిక స్థితిని , కఠినమైన ప్రశ్నలను అడగడానికి జోబిడెన్ చొరవను నేను అభినందించాను." అని పేర్కొన్నాడు.



Full View

Similar News