ఇప్పటికిప్పుడు కాదు కానీ.. గడిచిన కొంతకాలంగా చాప కింద నీరు మాదిరి తెలుగు రాష్ట్రాల్లో దారుణ క్రైమ్ కల్చర్ పెరుగుతోంది. గతంలో నేరమయ జీవితాలంటూ కొన్ని ఉండేవి. వారు నేరాలు చేస్తున్నారంటే.. మానుఫ్యాక్చరింగ్ లో తేడా అనుకోవచ్చు. లేదంటే.. పెరిగిన తీరు తేడా అనుకోవచ్చు. ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. అప్పటివరకు ఎలాంటి నేర చరిత్ర లేనోళ్లలో ఒక్కసారిగా దారుణ నేరాలకు పాల్పడుతున్న తీరుతో షాక్ తినే పరిస్థితి. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. తెలుగు రాష్ట్రాల్లో ఈ విపరీత ధోరణి ఎక్కువైంది.
పెళ్ళికి ఒప్పుకొన్నాడని గొంతు కోసిన యువతి ఉదంతానికి భిన్నంగా.. పెళ్ళికి ఒప్పుకోలేదని కాల్పులు జరిపిన యువకుడు ఉదంతం చోటు చేసుకుంది. అదే సమయంలో.. ప్రేమించలేదని యువతిని చంపిన యువకుడు ఆరాచకం ఒక వైపు.. పక్కింటివాడి ప్రేమలో పడి భర్తను మర్డర్ చేసిన గృహిణి ఉదంతం ఇంకోవైపు. ఈ రాక్షసత్వానికి సరికొత్త పైశాచికత్వం ఈ మధ్యన తరచూ వెలుగు చూస్తున్నాయి. పసికందు పై అత్యాచారం జరిపిన యువకుడు ఒకవైపు.. ఇంటిబిడ్డను రేప్ చేసిన వృద్ధుడు. దారుణాలు చేయటానికి ఆడ..మగా అన్న తేడా లేకపోవటమే కాదు వయసులో తారతమ్యాలు లేకుండా పోతున్నాయి.
ఈ దారుణ నేరాలకు బరితెగింపు మరింత ఆందోళన కలిగిస్తోంది. గతంలో.. ఏదైనా నేరం చేసేవాడు నలుగురి ముందు.. నడి రోడ్డు మీద నేరం చేయటానికి వణికి చచ్చేవాడు. ఇప్పుడు అందుకు భిన్నంగా ఎలాంటి మొహమాటం లేకుండా చేస్తున్న ఘోరాల్ని చూస్తే.. నోట మాట రాని పరిస్థితి.
భర్తకళ్లెదురుగానే పై భార్యపై గ్యాంగ్ రేప్ చేయటమే కాదు.. అడ్డు పడిన భర్తను కొట్టేసి మరీ కామపిశాచుల మాదిరి వ్యవహరించిన ఉదంతం ఒకవైపు.. టీచర్ ఎదురుగానే క్లాస్ మేట్ ప్రాణం తీసిన విద్యార్థులు ఇంకోవైపు. భార్యతో వ్యభిచారం చేయిస్తున్న భర్త.. ప్రియుడితో భర్తను మట్టుపెట్టిన భార్య . ఇలా నేరాలకు.. ఘోరాలకు నెలవుగా మారుతున్నాయి తెలుగు లోగిళ్లు.
వీటికి తోడుగా ప్రేమ పేరుతో జరుగుతున్న హత్యలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. కాలం మారినా.. మారని మనసుల కారణంగా తాము కాదన్నోళ్లను పెళ్లాడిన పాపానికి సింఫుల్ గా ప్రాణాలు తీసేస్తున్నారు. వేరే కులం వ్యక్తిని పెళ్ళాడిందని హత్య చేసిన బాబాయి ఉదంతం ఒక ఎత్తు అయితే.. తమ మతం కాని అమ్మాయిని పెళ్లాడంటూ అన్యమతానికి చెందిన అబ్బాయిని నడిరోడ్డు మీదనే నరికేసిన సోదరుడు.
బంధాలు.. అనుబంధాలకు సెలవుచీటి ఇస్తూ.. మానవత్వం మనషుల్లో ఎక్కడుందన్నది భూతద్దం వేసుకొని తిరిగే పరిస్థితిని తీసుకొస్తున్నారు. అలా తిరిగే వేళలో.. ఎవరికి ఎప్పుడు ఎందుకు కోపం వచ్చి ప్రాణాలు తీస్తారన్న భయం వెంటాడేలా చోటు చేసుకున్న ఉదంతాలు రాబోయే రోజుల్లో 'నమ్మకాన్ని' నిలువునా పాతి పెట్టేస్తున్నారని చెప్పాలి.