ఈ ప్రపంచంలో ఒక్కో దేశంలో ఒక్కో సంప్రదాయం - ఆచార - వ్యవహారాలు ఉంటాయి. అలాగే జపాన్ లో కూడా ఒక సంప్రదాయం ఉంది. జపాన్ లో ప్రతి సంవత్సరం కూడా ఒక విన్నూతనమైన ఫెస్టివల్ ని అందరూ కలిసి జరుపుకుంటారు. ఆ పండుగ కోసం జపాన్ వసూళ్లు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తుంటారు. ఆ పండుగే హడక మత్సూరీ..! జపాన్ వాసులు ఈ ఫెస్టివల్ ని ఒంటిపై బట్టలు లేకుండా ( నగ్నంగా) జరుపుకుంటారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా హడక మత్సూరీ చాలా ఘనంగా జరిగింది.
అసలు ఆహడక మత్సూరీ ఫెస్టివల్ ప్రత్యేకత ఏంటంటే ...ఈ పండుగలో పాల్గొనే ప్రతి ఒక్కరు కూడా నగ్నంగా ఉంటారు. దీనికి జపాన్ లో ఎంతో క్రేజ్ ఉంది. ఈ ఫెస్టివల్ ఒకయామా పరిధిలోని హోన్షు ఐలాండ్ లోని సైదైజీ కన్నోనియాస్ టెంపుల్ లో జరుగుతుంది. అయితే , ఈ ఫెస్టివల్ లో మెన్స్ మాత్రమే పాల్గొంటారు. కేవలం ఓ గోసి మాత్రమే కట్టుకుని.. కాళ్లకు రెండు సాక్సులు వేసుకుని . ఇక ఒంటిపై ఎటువంటి గుడ్డ పేలిక కూడా లేకుండా ఈ ఫెస్టివల్‌లో పాల్గొంటారు. ఈ ఏడాది కూడా ఈ నగ్న పండుగలో 10 వేల మందికి పైగా జపాన్‌వాసులు పాల్గొన్నారు.
ఇక , కన్నోనియాస్ టెంపుల్ లో రాత్రి 10 గంటలకు లైట్లు వెలగగానే పూజారి 100 బండిళ్ల చెట్ల కొమ్మలు, ఒక రెండు లక్కీ షింగీ కట్టెలను జనంలోకి విసురుతారు. అప్పుడే అసలైన పండుగ మొదలవుతుంది. ఈ కొమ్మలు, కట్టెల కోసం యువకులంతా ఒకరితో ఒకరు పోటీ పడతారు. ఒకరినొకరు తోసుకుంటూ, తొక్కుకుంటూ కర్రల కోసం ఎగబడతారు. కొంతమందికి ఈ ఫెస్టివల్ లో తోచుకోవడం తో దెబ్బలు కూడా తగులుతాయి. కాళ్లు - చేతులు కూడా ఇరుగుతుంటాయి.కానీ , భక్తులు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. ఈ కొమ్మలు - కట్టెలు దొరికితే ఆ ఏడాదంతా మంచి జరుగుతుందని ప్రజల నమ్మకం. పంటలు బాగా పండాలని - అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని , సంతాన భాగ్యం కలగాలని ఈ ఫెస్టివల్ నిర్వహిస్తుంటారు. వేలాది మంది ఈ ఫెస్టివల్ లో పాల్గొని తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఈ ఫెస్టివల్ లో పాల్గొని , తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వేలాదిమంది అక్కడికి వస్తుంటారు. అలాగే దేశం నలుమూలల నుండి నెకేడ్ ఫెస్టివల్ ను చూసేందుకు ప్రజలు భారీగా తరలివస్తుంటారు.