ఏపీ ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా కడప. అయితే.. ఇక్కడి వైసీపీ నేతలే సర్కారు తీరుపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరుగుతున్నారు. ప్రజలకు-తమకు మధ్య రిలేషన్ తెగిపోతోందని వాపోతున్నారు. దీనికికారణం.. ప్రభుత్వం చేస్తున్న నిర్వాకాలేనని అంటున్నారు. పన్నుల పెంపు.. చెత్తపన్ను కట్టకపోతే.. ఇతరత్రా పనులు నిలిపివేస్తామంటూ..తాఖీదులు ఇస్తుండడంపై కడపలోని ప్రజలే గగ్గోలు పెడుతున్నారు.
వాస్తవానికి కడపను ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధానం అమలైతే.. అదే ఇక్కడ కూడా అమలు జరుగుతుంది. అయితే.. కడప అంటే వైసీపీకి కంచుకోట. దీంతో తమ సాధక బాధలు వింటారని ఇక్కడి ప్రజలు ఆశలు పెట్టుకుంటారు. కానీ, ఇప్పుడు ప్రజాప్రతినిధులు గడపగడపకు వెళ్తుండ డంతో వారు చెబుతున్న సాధక బాధలను వినే పరిస్థితి ఎమ్మెల్యేలకు లేకుండా పోయింది.
ఎమ్మెల్యేకన్నా.. అధికారులకు ఎక్కువ పవర్ ఇచ్చేశారని... తాము చెబుతున్నా కూడా అధికారులు విని పించుకోవడం లేదని వైసీపీ కీలక నేతలు సైతం.. వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. ఇటీవల కడప మునిసిపాలిటీలో మేయర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మెరుపు వేగంతో అధికా రులపై విరుచుకుపడ్డారు. ఇక, ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా అదే బాటలో ఉన్నారు.
తాజాగా నలుగురు వైసీపీ కీలక ఎమ్మెల్యేలుకడప కలెక్టర్‌ను కలిసి.. ప్రజల బాగోగులు చూడాలని.. పన్ను లు పిండుకోవడమే ఉద్యోగమా? అని ప్రశ్నించడం తీవ్ర కలకలం రేపుతోంది. దీనిపై సదరు అధికారులు మౌనంగానే ఉన్నా.. నాయకులు మాత్రం ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను తట్టుకోలేక .. నానా తిప్పలు పడుతున్నారు. దీంతో కొందరు రాజకీయాలే వదిలేస్తాం! అనే కామెంట్లు చేస్తుండడం గమనార్హం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.