ప్రస్తుతం అకాల వర్షాల కారణంగా.. నష్టపోయిన రైతాంగాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శిస్తున్నా రు. వారిని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పంటలను ఆయన పరిశీలిస్తున్నారు. నేరుగా బురదమయంగా ఉన్న పొలాల్లోకే ఆయన వెళ్తున్నారు. ప్రభుత్వానికి వార్నింగులు ఇస్తున్నారు. రైతుల కు టీడీపీ అండగా ఉంటుందని చంద్రబాబు భరోసా ఇస్తున్నారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే.. రైతుల ఓటు బ్యాంకు కోసమే.
మరి వచ్చే ఎన్నికల్లో రైతులు చంద్రబాబు వెంట నిలుస్తారా? లేక..రైతు రాజ్యం తమదేనని చెబుతున్న వైసీపీ తో సాగుతారా? అనేది ఆసక్తిగా మారింది. ఆర్బీకేలు ఏర్పాటు చేశాం..ప్రతి మండలంలోనూ.. పశు వైద్య శాలలను మొబైల్ రూపంలో చేరువ చేశాం. రైతుల నుంచి ఎలాంటి సమస్య వచ్చినా చెప్పుకొనేందు కు వలంటీర్లు ముందున్నారని.. వైసీపీ నాయకులు చెబుతున్నారు. అంటే.. వైసీపీ తాము రైతు పక్షపాత ప్రభుత్వమని పదే పదే చెబుతోంది.
ఈ నేపథ్యంలో వైసీపీని కాదని.. రైతులు చంద్రబాబు వెంట నడుస్తారా? అనేది ముఖ్యం. ఇదిలావుంటే.. రైతు భరోసా కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఆరు వేల కు మరో 7 వేల రూపాయలు కలిపి వైసీపీ ప్రభుత్వం అదిస్తోంది. ఇది అందరు రైతుల కు అందుతోంది. దీనిలో ఎక్కడా వివక్ష లేదనేది అందరికీ తెలిసిందే. అదేసమయంలో గత ప్రభుత్వం మిగిల్చి పోయిన.. రైతు రుణ మాఫీని కూడా వైసీపీ ప్రభుత్వం పూర్తి చేసింది.
దీనిని కూడా వైసీపీ అధినేత , సీఎం జగన్ పదే పదే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరిగిన అకాల విపత్తు ఒక్కటే వైసీపీ స్పందించలేదనే టాక్ వినిపిస్తోంది. ఇది పక్కన పెడితే.. ఇతర విషయాల్లో అన్నదాతకు.. పార్టీ, ప్రభుత్వం అండగానే ఉన్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుంటే.. టీడీపీ కి రైతుల ఓటు బ్యాంకు పడుతుందా? లేదా? అనేది కొన్నాళ్లు వెయిట్ చేస్తే తప్ప చెప్పలేమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.