ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీ, బీజేపీల మధ్య పొత్తు ఉంది. వచ్చే ఎన్నికల్లోనూ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతోపాటు ఏపీ బీజేపీ వ్యవహారాల సహ ఇన్‌చార్జ్ సునీల్ దియోధర్ తేల్చిచెప్పారు.
వైసీపీ, టీడీపీ కుటుంబ పార్టీలని, రెండూ అవినీతి పార్టీలేనని సునీల్ దియోధర్ హాట్ కామెంట్స్ చేశారు.
మరోవైపు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సైతం ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ అంటే గౌరవం ఉందని.. అయితే ఊడిగం చేయబోమన్నారు. తాను అడిగిన రోడ్ మ్యాప్‌ను బీజేపీ ఇంతవరకు ఇవ్వలేదన్నారు.
వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వనని పవన్ కల్యాణ్ ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. ఈ క్రమంలో టీడీపీ–జనసేన–బీజేపీ కలసి పోటీ చేయాలనేది పవన్ మనసులో మాటగా ఉందని తెలుస్తోంది.
మరోవైపు బీజేపీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీతో కలిచే చాన్సు లేదనే చెబుతోంది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అమిత్ షా కాన్వాయ్‌పై తిరుపతిలో జరిగిన దాడి, తమపై టీడీపీ నేతలు విమర్శలు చేసిన వైనాన్ని బీజేపీ మర్చిపోలేకపోతోందని అంటున్నారు.
అయితే టీడీపీని కూడా కలుపుకు వెళ్లే విషయంలో బీజేపీలో ఏపీ రాష్ట్ర నేతల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని తెలుస్తోంది. కొందరు మూడు పార్టీలు వచ్చే ఎన్నికల్లో కలసి పోటీ చేయాలని కోరుకుంటున్నారని అంటున్నారు. మూడు పార్టీలు కలసి పోటీ చేస్తే అధికారంలోకి రావడం పక్కా అని.. దీనివల్ల బీజేపీ కూడా లాభపడుతుందని చెబుతున్నారు.
అధికారంలో భాగం పంచుకోవడంతోపాటు కొన్ని ఎంపీ సీట్లను దక్కించుకోవచ్చనేది బీజేపీ నేతల్లో కొందరిలో అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరికొందరు మాత్రం టీడీపీతో పొత్తు పెట్టుకున్న ప్రతిసారీ ఆ పార్టీనే బలపడిందని.. బీజేపీకి ఒనగూరిన ప్రయోజనం చాలా స్వల్పమని అంటున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం బీజేపీ విషయంలో ఆశలు చంపుకోకుండా ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. పవన్ కల్యాణ్ పొత్తుకు సంసిద్ధంగానే ఉన్నారని.. ఈ నేపథ్యంలో బీజేపీని కూడా ఒప్పిస్తే తమ పని మరింత సులువవుతుందని చంద్రబాబు లెక్కలు వేసుకుంటున్నారట. తనకున్న పరిచయాల ద్వారా బీజేపీని ఒప్పించే ప్రయత్నాల్లో ఆయన ఉన్నారని తెలుస్తోంది.
మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ నవంబర్ 11న విశాఖపట్నం రానున్నారు. కొన్ని కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ నేతలకు పొత్తుల విషయంలో దిశానిర్దేశం చేస్తారని టాక్ నడుస్తోంది. అందులోనూ తెలంగాణలో మునుగోడులో జరుగుతున్న ఉప ఎన్నిక ఫలితం నవంబర్ 3 నాటికి వెలువడుతుంది.
తెలంగాణలో సైతం బీజేపీ భారీ ఆశలు పెట్టుకుంది. అధికారంలోకి రావాలని పెద్ద లెక్కలే వేసుకుంటోంది. అయితే కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ల నుంచి అక్కడ బీజేపీకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఏపీలోనూ ఎవరితో కలిసి నడవాలి, వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడం తదితరాలపై నరేంద్ర మోడీ దిశానిర్దేశం చేస్తారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పొత్తులపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. దీంతో ప్రధాని మోడీ ఏపీ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.