వర్తమానంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల్ని ఒక్కసారి జాగ్రత్తగా గుర్తుకు తెచ్చుకోండి. ఏడేళ్ల క్రితం రాష్ట్రం కొత్తగా ఏర్పడిన నాటినుంచి ఐదారేళ్ల క్రితం వరకు తరచూ ఆయన నోటి ఒక మాట వస్తూ ఉండేది. తెలంగాణకు ఏం తక్కువని.. సంపన్న రాష్ట్రమని.. ధనిక రాష్ట్రమని తరచూ చెప్పకునే వారు. మాటల్లో ఇంత గొప్పగా చెప్పుకునే కేసీఆర్.. ఇటీవల కాలంలో తన మాటల్లో ధనిక.. సంపన్న అన్న మాటల ప్రస్తావన తీసుకురావటం మానేశారు.
ఎందుకంటే.. రాష్ట్రాన్ని అప్పులకుప్పలా మార్చటమే కాదు.. తీసుకొచ్చిన అప్పుకు చెల్లించాల్సిన వడ్డీ.. తలకు మించిన భారంగా మారిందన్న మాట వినిపిస్తోంది. అంతా బాగున్నప్పుడు వడ్డీదేముంది? కట్టేస్తాం.. అదేం పెద్ద విషయం కాదన్నట్లుగా మాట్లాడేవారు. చూస్తుండగానే.. వడ్డీ అంతకంతకూ పెరిగిపోవటమే కాదు.. ఇప్పుడు వడ్డీ మాటే వణుకు పుట్టేలా తయారైంది.
సంక్షేమ పథకాల కోసం.. వరాల అమలుకు ఇష్టం వచ్చినట్లుగా అప్పులు చేయటంతో.. రాష్ట్ర ఏర్పాటు సమయంలో పోలిస్తే.. రుణాలు భారీగా పెరిగాయి. అంతేకాదు.. రుణాల మీద చెల్లించాల్సిన వడ్డీ కూడా ఎక్కువైంది. 2014-15లో అప్పులకు చెల్లించాల్సిన వడ్డీ కింద రూ.5195 కోట్లు చెల్లిస్తే.. ఇప్పుడు అది కాస్తా రూ.15వేలకు పెరగటం షాకింగ్ గా మారింది.
గత డిసెంబరు వరకు రూ.11500 కోట్ల మొత్తాన్ని రుణాలకు వడ్డీగా చెల్లించాల్సి ఉండేది. లాక్ డౌన్ కారణంగా పడిన దెబ్బతో.. రుణాల మీద వడ్డీ మోత మరింత పెరిగి.. ఏటా రూ.15వేల కోట్ల వరకు చెల్లించాల్సిన దుస్థితి. దీంతో.. సొంత ఆదాయాల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టి.. రుణాలు తెచ్చే అలవాటును మార్చుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం పదే పదే చెబుతున్నట్లుగా తెలుస్తోంది. అందుకే అంటారు. అప్పు చేయటం తేలిక.. తీర్చటమే కష్టమని.