యాప్‌లలో క్రేజీ యాప్‌గా టిక్‌టాక్ ఉండేది. కోట్లాది మంది ఆ యాప్‌ను వినియోగిస్తూ కాలక్షేపం చేసిన వారు చాలా మంది ఉన్నారు. ఆ యాప్‌తో సెలబ్రిటీలుగా మారిన వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఆ యాప్‌తోనే ఉపాధిగా ఎంచుకున్న ఎంతో మంది ప్రస్తుతం కష్టాలు పడుతున్నారు. డాన్స్‌లు, కామెడీ డైలాగులు.. లిప్-సింక్‌లు.. వంటి వాటితో సరదాగా గడిపారు. ప్రస్తుతం ఆ యాప్‌కు గడ్డుకాలం వచ్చింది. చైనా దేశం తీరుతో ఆ యాప్‌ను అందరూ నిషేధిస్తున్నారు. చాలాసార్లు వివాదాస్పదమైన ఆ యాప్ చివరకు కొన్ని దేశాల్లో ఇప్పుడు కనిపించకుండాపోయింది. ఇప్పుడు అమెరికాలో కూడా ఆ యాప్ నిషేధానికి గురవుతోంది. మొదటి నుంచి చైనా దేశంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనల్డ్ ట్రంప్ భారతదేశం చైనా యాప్‌లను నిషేధించినట్టు చేయనున్నారు. చైనాకు సంబంధించిన యాప్‌లలో టిక్‌టాక్ ప్రధానమైనది. బైట్ డ్యాన్సు సంస్థకు సంబంధించిన యాప్ అమెరికా ఎందుకు నిషేధించాలనుకుంటోంది.. అమెరికాకు.. చైనాకు మధ్య చిచ్చు రేపేలా ఏం జరిగిందో తెలుసుకోండి.
అమెరికా, చైనాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తటంతో.. చైనాతో బలమైన సంబంధాలున్న ఈ యాప్ పలు దేశాల్లో నిషేధాన్ని ఎదుర్కొంటోంది. అమెరికా, ఆస్ట్రేలియాలు కూడా నిషేధించే విషయాన్ని పరిశీలిస్తున్నాయి. టిక్‌టాక్ అనేది ఒక ఫ్రీ యాప్. ఒక రకంగా యూట్యూబ్‌కు షార్ట్-ఫామ్ గా ఉంది. యూజర్లు ఒక నిమిషం వరకూ నిడివి ఉన్న వీడియోలను పోస్ట్ చేస్తుండేవారు. పాటలు, ఫిల్టర్లనూ ఉపయోగించుకుని.. లిప్-సింక్ చేయటానికి కామెడీ క్లిప్‌లు, సినిమా డైలాగులు చేస్తూ వీడియోలు రూపొందించేవారు. ఈ యాప్ 2019 ఆరంభం నుంచీ టాప్ డౌన్‌లోడ్ చార్ట్‌లలో దాదాపు అగ్రస్థాయిలోనే కనిపిస్తోంది. వైరస్ వ్యాప్తి చెందిన సందర్భంగా విధించిన లాక్‌డౌన్ సమయంలో ఇంటర్నెట్ వినియోగం పెరిగి ఈ టిక్‌టాక్ యాప్ హల్‌చల్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. దాదాపు 80 కోట్ల మంది యాక్టివ్ యూజర్లుగా ఉన్నారు. ఇన్నాళ్లు టిక్‌టాక్ యాప్ కు భారతదేశం అతి పెద్ద సంఖ్యలో యూజర్లు ఉండేవారు. ప్రస్తుతం నిషేధించడంతో చైనానే అతి పెద్ద మార్కెట్ గా ఉండగా.. ఆ తర్వాత అమెరికా నిలుస్తోంది.
టిక్‌టాక్ మనుగడ మూడు విభిన్న యాప్‌ల రూపంలో మొదలైంది. మొదటిది అమెరికాకు చెందిన మ్యూజికల్లీ (Musical.ly) అనే యాప్. దీనిని 2014లో ప్రారంభించారు. చైనాకు చెందిన టెక్ దిగ్గజం బైట్‌డ్యాన్స్ 2016లో డోయిన్ పేరుతో మ్యూజికల్లీ తరహా యాప్‌ను లాంచ్ చేసింది. ఆ యాప్‌ను బైట్‌డ్యాన్స్ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తూ దానికి పేరు పెట్టింది. అదే టిక్‌టాక్. 2018లో బైట్‌డ్యాన్స్ సంస్థ మ్యూజికల్లీ యాప్‌ను కొనుగోలు చేసింది. దానిని టిక్‌టాక్‌లో చేర్చింది. అయితే చైనా సంస్థ యాజమాన్యం నుంచి ఈ యాప్‌ను దూరంగా ఉంచటానికి బైట్‌డ్యాన్స్ ప్రయత్నించింది. దీనిలో భాగంగా డిస్నీ మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ కెవిన్ మేయర్‌ను టిక్‌టాక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా నియమించింది. యూజర్లు కాపీ, పేస్ట్ చేసే క్లిప్‌బోర్డులను యాప్ నిరంతరం చదువుతోందని ఇటీవల తేలడంతో డాటా సేకరణపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. టిక్‌టాక్ యాప్ మీద బ్రిటన్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ ఆఫీస్ ప్రస్తుతం దర్యాప్తు చేస్తోంది.
టిక్‌టాక్ యూజర్ల డాటా చైనా కమ్యూనిస్ట్ పార్టీ చేతుల్లోకి వెళుతోందని.. కాబట్టి ఆ యూజర్లకు ముప్పు పొంచి ఉందని అమెరికా ఆరోపించింది. తాము చైనా ప్రభుత్వ చెప్పుచేతల్లో ఉన్నామనే ఆరోపణలు పూర్తిగా తప్పు అని ఆ సంస్థ వివరణ ఇచ్చింది. చైనా ప్రభుత్వం టిక్‌టాక్‌ను డాటా కోసం అడిగితే తాము కచ్చితంగా ఇవ్వమని స్పష్టం చేసింది. ఈ సంస్థకు చెందిన భారీ ప్రజాదరణ గల న్యూస్ యాప్ టోటియావోపై కూడా తీవ్ర ఆరోపణలు.. విమర్శలు వచ్చాయి. అశ్లీల, అసభ్య సమాచారం (పోర్నోగ్రాఫిక్ అండ్ వల్గర్ కంటెంట్)ను వ్యాపింప చేస్తోందని వార్తలు వచ్చాయి. ప్రపంచంలో ఇంటర్నెట్ క్షేత్రంలో అత్యంత పరిమితులు, ఆంక్షలు ఉన్న దేశాల్లో చైనా ఒకటి. ఆ దేశపు గ్రేట్ ఫైర్‌వాల్.. తన పౌరులకు వెబ్‌లోని కొన్ని భాగాలు అందకుండా అడ్డుకుంటుందనేది అందరికీ తెలిసిన సత్యం. పరిశీలనకు వచ్చిన వీడియోలను అనుమతించాలా లేదా అనే అంశం మీద చైనాలోని మోడరేటర్లదే తుది నిర్ణయమని టిక్‌టాక్ మాజీ ఉద్యోగులు చెబుతున్నారు. ఈ సంస్థ నియంత్రణ సంస్కృతి ఇంకా చైనా ప్రభుత్వానికి అనుకూలంగా పక్షపాతపూరితంగానే ఉండవచ్చునని తెలుస్తోంది.