ఆకాసంలో సగం.. అన్నింటా అన్యాయం.. అన్న సామెతను కొన్ని రోజులగా వాడాల్సిన అవసరం లేకుండా పోతుంది. ఎందుకంటే దాదాపు అన్ని రంగాల్లో మహిళలు దూసుకెళ్తున్నారు. ఇటీవల కాలంలో ఆర్మీలోనూ మహిళలు చేరారంటే వారు ఏ స్థాయిలో ఎదిగారో చెప్పవచ్చు. ఇంతలా రాణిస్తున్న మహిళలకు క్రీడారంగంలో మాత్రం సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదనే ఆవేదన వారి నుంచి వ్యక్తమవుతోంది. క్రీడా రంగానికి చెందిన వారిని ప్రజలకు పరిచయడం చేయడంలో భారత్ లోని వ్యవస్థలు.. మీడియా పెద్దగా ఆసక్తి చూపడం లేదనే విషయం అర్థమవుతోంది.
ఓ జాతీయ దినపత్రికలో 2017లో క్రీడా రంగానికి చెందిన 10 వార్తలు ప్రచురణ అయితే అందులో క్రీడాకారిణిల గురించి కేవలం ఒక వార్త మాత్రమే ఉంది. అయితే 2020 నాటికి ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. 2020 ప్రారంభంలో వుమెన్స్ టీ20 వరల్డ్ కప్ లో భారతీయ జట్టు ఫైనల్ కి చేరింది. ఈ టోర్నమెంట్ జరుగుతున్నంతసేపు షఫాలి వర్మ తన అసాధరణ బ్యాటింగ్ గురించి ప్రచారం చేశారు. దీంతో షఫాలి వర్మ ఎవరు..? అని సెర్చ్ చేశారు.
సాధారణంగా ఓ పత్రిక స్పోర్ట్స్ పేజీలో క్రీడాకారిణిల కంటే క్రీడాకారుల గురించే ఎక్కువగా వార్తలు ఇస్తారు. అయితే మహిళలు క్రీడల్లో పాల్గొంటే మాత్రం పత్రికలు పట్టించుకోవడం లేదట. ఉదాహరణకు మేరీ కోమ్, పీవీ సింధు, సైనా నెహ్వాల్ లాంటి వారు క్రీడల్లో పాల్గొంటున్నప్పుడు వారి సమాచారాన్ని ప్రచురించడం లేదు. కేవలం ఫోటోలు లేకుండా చిన్నగా వార్తలు ఇస్తున్నారు.
అయితే ఇలా క్రీడాకారిణుల గురించి వార్తలు రాయడంతో హరియాణ రాష్ట్రం ముందున్నట్లు ఇటీవల ఓ జాతీయ మీడియా చేసిన సర్వేలో తేలింది. రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నట్లు తెలిపింది. అయితే కొన్ని పత్రిలకు క్రీడాకారిణుల గురించి రాసేటప్పుడు ప్రత్యేకమైన పదాలు వాడారు. కిక్ బాక్సింగ్ నుంచి వచ్చేవాళ్లను 'ఐరన్ లేడీ' 'ఏజ్ లెస్ మేరి' లాంటి పదాలనువాడారు. ఇక కొన్ని పత్రికలు ‘గ్లామరస్ హైదరాబాదీ' ‘క్వీన్ సోఫియా' లాంటి పదాలు వినియోగించారు.
మొత్తంగా భారతదేశంలో పత్రికలలో మహిళా క్రీడాకారిణులకు వార్తల్లో 30 శాతం కంటే తక్కువగానే ప్రచురితమవుతుందని ఓ సర్వేలో తేలింది. అలాగే ఫ్రంట్ పేజీలో మహిళా క్రీడాకారిణుల గురించి 1 శాతం కంటే తక్కువగానే ఉందని అంటున్నారు.