అమ్మాయిలను ప్రేమలో పడేయడం చాలా ఈజీనే కాని వారి నమ్మకంను నిలుపుకోవడం మాత్రం చాలా కష్టం అంటూ ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది. తాజాగా ఒక అంతర్జాతీయ సంస్థ నిర్వహించిన సర్వే కాస్త అటు ఇటుగా అదే విషయాన్ని చెబుతోంది. పలు వర్గాలకు చెందిన వేలాది మంది ఆడవారిని ఆన్ లైన్ ద్వారా కొన్ని ప్రశ్నలను అడిగిన సదరు సంస్థ ఆ తర్వాత ఆసక్తికర విషయాలను వెళ్లడి చేసింది. ఆడవారి మనోభావాలను ఆ సర్వేలో ఆవిష్కరించడం జరిగింది.
ఇంతకు ఆ సర్వే ఫలితం ఏంటీ అంటే... అమ్మాయిలు ఎక్కువగా అన్ని విషయాల్లో కూడా జెన్యూన్ గా ఉండాలనుకుంటారు. తమ జీవిత భాగస్వామి కూడా జెన్యూన్ గానే ఉండాలని వారు భావిస్తారట. ఏ అబ్బాయి అయితే తమను శారీరకంగా కాకుండా మానసికంగా ఇష్టపడతాడో అలాంటి అబ్బాయిలనే అమ్మాయిలు కోరుకుంటారట. వారినే నిజమైన ప్రేమికులుగా భావిస్తారట. అబ్బాయిలు ఎక్కువగా తమను ప్రేమిస్తూ ఉండాలని ఎక్కువ శాతం సమయంను తమతో గడపాలని వారు కోరుకుంటారట. సమయానుసారంగా ప్రేమను చూపిస్తూ ఫీలింగ్స్ ను షేర్ చేసుకున్నప్పుడు సరిగ్గా రెస్పాండ్ అవ్వాలని కోరుకుంటారట.
శారీరకంగా కలిసిన సమయంలో కూడా సంతృప్తిని కోరుకుంటారు కాని ఇతర సమయాల్లో వారి భావాలను మనసును అర్థం చేసుకున్న వారికే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారట. ఇక కొంత మంది డబ్బు కోరుకుంటారని అమ్మాయిలపై విమర్శలు చేస్తారు. కాని అమ్మాయిలు డబ్బు కంటే కూడా ముఖ్యంగా అబ్బాయి ప్రవర్తన తనతో ప్రవర్తిస్తున్న తీరు తనపై చూపుతున్న ఆప్యాయతను చూసి ప్రేమిస్తారని సర్వే రిపోర్ట్ లో వచ్చింది.
ఒక అబ్బాయితో మెంటల్లీ దగ్గర అయితే ఆ అమ్మాయి అతడిని జీవితాంతం గుర్తుంచుకుంటుందని ఏదో పెద్ద అగాధం ఇద్దరి మద్య ఏర్పడితే తప్ప అతడిపై కోపంను తెచ్చుకుంటుందట. అతడు కలిసి ఉన్న సమయంలో నిజమైన ప్రేమను చూపిస్తే ఆమె ఫీలింగ్స్ ను అర్థం చేసుకుని ఆప్యాయతను చూపిస్తే అతడు చనిపోయినా కూడా అతడి ప్రేమలోంచి ఆమె బయటకు రాలేదట.