సునామీ భయం.. జనాలు ఏం చేశారంటే..?

Update: 2018-12-26 11:55 GMT
2005కు ముందు వరకూ అది ఊహా మాత్రమే.. శాస్త్రవేత్తలు సముద్రం ఉప్పొంగుతుందని.. దాన్ని సునామీ అంటారని అప్పుడప్పుడు చెప్పేవారు. జనాలకు దానిగురించి ఏమీ తెలియదు.. సునామీని లైవ్ లో చూసిన వారు అప్పటి వరకూ ఎవ్వరూ లేరు. కానీ 2005లో ఇండోనేషియా దేశం సమీపంలోని సముద్రంలో వచ్చిన భారీ భూకంపం సముద్రాన్ని ఉప్పొగించింది. దాదాపు రిక్టర్ స్కేలు పై 10 తీవ్రతతో వచ్చిన అతి పెద్ద భూకంపానికి సముద్రం పోటెత్తింది. సునామీగా విజృంభించి ఇండోనేషియాతో పాటు దాని సమీపంలో ఉన్న మలేషియా- ఫిలిప్పిన్స్- మయాన్మార్- భారత్- బంగ్లదేశ్- శ్రీలంకలతో పాటు దూరంగా ఉన్న దక్షిణాఫ్రియా- ఆఫ్రికా దేశాలను కూడా ముంచెత్తింది.

2005లో వచ్చిన భూకంపం ధాటికి ఇండోనేషియాలోనే 2 లక్షలమంది ప్రాణాలు కోల్పోయారు. భారత్ సహా వివిధ దేశాల్లో లక్ష మంది వరకు చనిపోయారు. ప్రపంచంలోనే అతి భీతావాహమైన ఈ సునామీ భయం ప్రజలను ఇంకా వెంటాడుతోంది.

ఇటీవలే ఇండోనేషియాలోని సముద్రంలో ఉన్న అగ్నిపర్వతం బద్దలవడంతో మరోసారి సునామీ వచ్చింది.కానీ ఈసారి ఇండోనేషియాను మాత్రమే అది తాకింది. అక్కడ ఇళ్లు, ఆస్తి నష్టంతోపాటు వందలాది  మంది ప్రాణాలు కోల్పోయారు. భారత్ ను కూడా తాకుతుందని భావించినా పెద్దగా నష్టం వాటిల్లలేదు.

ఇండోనేషియాలో సునామీ భారత్ ను చేరకపోవడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా విశాఖపట్నం జిల్లాలోని పెద్ద జాలరిపేట వాసులు సునామీ రాకూడదని ప్రార్థిస్తూ సముద్రుడికి పూజలు చేశారు. గ్రామస్థులంతా బోనాలు, వివిధ పూజా సామగ్రిని నెత్తిన బిందెల్లో పాలు తీసుకొని వచ్చి విశాఖ సముద్ర తీరంలో పూజలు చేసి సముద్రుడు శాంతించాలని పాలు పోసి నైవేద్యం సమర్పించారు. సునామీ పోటెత్తవద్దని సముద్రుడు శాంతించాలని పూజలు చేశారు.

ఊరు ఊరంతా ఇలా సునామీ భయంతో తీరం వెంబడి రావడం పూజలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. జనాల్లో సునామీ పట్ల  ఉన్న భయాన్ని ఇది తేటతెల్లం చేసింది..
Tags:    

Similar News