రాజకీయాల్లో కొన్ని సార్లు చిక్కు ప్రశ్నలు ఎదురవుతాయి. మిత్రులు శత్రువులు అవుతారు. అలాగే స్థానాలు మారుతూంటే వారు వీరు అవుతారు. ఒకపుడు కేంద్రంలో మోడీతో తెలంగాణా సీఎం కేసీయార్, ఏపీ సీఎం జగన్ ఇద్దరూ మంచి దోస్తీ చేస్తూ వచ్చారు. దాంతో ఎవరికీ ఇబ్బంది లేకపోయింది. కానీ గత కొన్నేళ్ళుగా కేంద్రంతో ఢీ అంటున్నారు కేసీయార్. మోడీతోనే డైరెక్ట్ అటాక్ అని ఆయన హడావిడి చేస్తున్నారు.
దానికి కారణం కేసీయార్ ఆలోచనలు మారాయి. బీజేపీ కూడా తెలంగాణాలో తమ రాజకీయాన్ని జోరెక్కించింది. సీఎం పీఠాన్ని టార్గెట్ చేసింది. దాంతో తన సీటు కిందకే నీళ్ళు చేరుతూండడంతో కేసీయార్ ఊరకే ఎందుకు ఉంటారు. దాంతో నా సీటు కు మీరు ఎసరు పెడితే మీ సీటుకు నేనూ ఎసరు పెడతాను అంటూ ఢిల్లీకే సవాల్ అన్నారు. టీయారెస్ కాస్తా అలా బీయారెస్ గా మారిపోయింది.
ఇలా మోడీ వర్సెస్ కేసీయార్ ఫైట్ పీక్స్ కి చేరుకుంటున్న వేళ ఏపీలో కూడా బీయారెస్ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తోంది. కేసీయార్ ఏపీ మీద ఫుల్ ఫోకస్ పెట్టనున్నారు. దాంతో కలసి వచ్చే పార్టీలను కలుపుకుని అక్కడ బీయారెస్ ని పటిష్టం చేయాలని చూస్తున్నారు. ఈ పరిణామాల నేపధ్యంలో ఆయన తన మిత్రుడు జగన్ వైపు ఆశగా చూస్తున్నారు అని అంటున్నారు. ఎందుకంటే ఏపీలో కేసీయార్ కి జగనే నిజమైన మిత్రుడు.
ఆయన చంద్రబాబుని అసలు నమ్మరు. బాబు టక్కుటమార విద్యలు అన్నీ కేసీయార్ కి తెలుసు. ఒక్కసారి బాబుకు మద్దతు ఇచ్చి ఊపిరిపోస్తే ఆయన తెలంగాణాలో తన కోటకే నిప్పంటిస్తాడు అన్న భయం కేసీయార్ లో ఉంది. దాంతో ఆయన కలలో కూడా బాబుతో కలవరు. పైగా బాబుని దెబ్బ తీసే వ్యూహాలకే పదును పెడతారు. అయితే కేసీయార్ కి ఇపుడు ఏపీలో తమ మిత్రుడు అయిన జగన్ సాయం అక్కరకు వస్తోంది.
నిజానికి చూస్తే ఏపీలో జగన్ కి బీయారెస్ వల్ల లాభమే తప్ప నష్టం లేదు అనే అంటున్నారు. బీయారెస్ విస్తరణ ద్వారా కొత్త పార్టీ పుడుతుంది, దాంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుంది. అందువల్ల వైసీపీ యాంగిల్ లో చూస్తే బీయారెస్ రాకను స్వాగతిస్తోంది. ఏపీలో బీయారెస్ పోటీ చేయవచ్చు. ఎవరైనా ఎక్కడైనా పోటీకి దిగవచ్చు అని వైసీపీ మంత్రులు నేతలు ఇప్పటికే చెప్పేశారు.
అయితే ఈ సాఫ్ట్ కార్నర్ ఒక్కటే కేసీయార్ కి చాలదు, ఏపీలో బీయారెస్ కాళ్ళూ వేళ్ళూ ఊనుకోవడానికి కావాల్సినంత మద్దతు వైసీపీ నుంచి ఆశిస్తున్నారు. ఒక విధంగా తనతో భుజం భుజం కలపమని కోరుకుంటున్నారు. అయితే మోడీని దారుణంగా విమర్శిస్తూ ఆయన వ్యతిరేక కూటమి కడుతున్న కేసీయార్ తో జట్టు కట్టడానికి జగన్ కి ఉండాల్సిన అభ్యంతరాలు ఉన్నాయని అంటున్నారు. మోడీతో సన్నిహితంగా గత నాలుగేళ్ళుగా ఉంటూ వస్తున్న జగన్ ఆ మంచి వాతావరణాన్ని కేసీయార్ కోసం పాడుచేసుకోవాలనుకోవడంలేదు అని అంటున్నారు.
బీయారెస్ కూడా అన్ని పార్టీల మాదిరిగా ఏపీలో వచ్చి పోటీ చేసుకోవచ్చు అని మాత్రమే ఆయన భావిస్తున్నారు అని అంటున్నారు. ఒక విధంగా జగన్ తటస్థంగానే ఉండాలని అనుకుంటున్నట్లుగా వైసీపీ వైఖరిని బట్టి చూస్తే అర్ధం అవుతోంది. మరో వైపు చూస్తే కేంద్రంతో వైసీపీకి జగన్ కి కూడా చాలా పని ఉంది అంటున్నారు. అదెలా అంటే జగన్ మీద కేసులు నడుస్తున్నాయి. అలాగే మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు కూడా ఉంది. దంతో కేంద్రంతో సన్నిహితంగా ఉండాల్సిన అనివార్యత ఉంది.
కేసీయార్ తో ఇండైరెక్ట్ గా అయినా కలిసినా మోడీ సర్కార్ రియాషన్ వేరుగా ఉంటుంది అన్నది జగన్ కి బాగా తెలుసు అంటున్నారు. అందువల్ల కేసీయార్ ఎంత మిత్రుడు అయినా ఏపీలో మాత్రం చేయి అందించి సాయం చేసే సీని అయితే లేదు అని అంటున్నారు. ఇక కేసీయార్ ఇపుడు జాతీయ పార్టీ పెట్టారు. విస్తరణ దశలో ఉన్నారు. అంటే ఇంకా బాల్యావస్థ ఆ పార్టీది. అదే కేంద్రంలో బలంగా బీజేపీ ఉంది. మరోసారి అధికారంలోకి వస్తుంది అన్న నమ్మకాలు ఉన్నాయి. దాంతో కేంద్రంతో మంచి వాతావరణాన్ని చెడగొట్టుకోకూడదు అని వ్యూహాత్మకమైన వైఖరితోనే జగన్ ఉన్నారని అంటున్నారు
ఇక కేసీయార్ కి సపోర్ట్ ఇవ్వకపోతే ఆయన కూడా అందరి మాదిరిగా ఏపీకి వచ్చి జగన్ని ఘాటుగా విమర్శిస్తారు. దాని వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు బాగా చీలి లాభమే కలుగుతుంది అన్నది జగన్ స్ట్రాటజీ. అలా కాకుండా తాము సపోర్ట్ చేస్తున్నామని ఏ విధంగా అయినా బయటపడినా బీయారెస్ సంగతేమో కానీ తమ రాజకీయం పుట్టె కూడా మునుగుతుంది అని ఆయన ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. మొత్తానికి కేసీయార్ కి దూరం పాటించడమే అన్ని విధాలుగా వైసీపీకి తనకు కలసి వచ్చేదిగా జగన్ ఫిక్స్ చేసుకుని ఉన్నారని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.