ఏడాది క్రితం కరోనా కేసులు పెరుగుతున్న వేళ.. అందరిలోనూ అయోమయం. అంతకు మించిన అభద్రతాభావం. తెలీని టెన్షన్ వెంటాడుతూ.. ఏమీ తోచని వేళలో.. అందరిలోని అదుర్దాను తగ్గిస్తూ.. తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన ప్రెస్ మీట్లకు వచ్చిన ఆదరణ అంతా ఇంతా కాదు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు.. సీఎం సాబ్ ప్రెస్ మీట్ ఎప్పుడు ఏర్పాటు చేస్తారా? అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేవారు. తాను ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో.. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పాటు.. చేపట్టాల్సిన జాగ్రత్తల్ని చెప్పేవారు.
అంతేకాదు.. కరోనాకు సంబంధించి తాను తెలుసుకున్న ఎన్నోముచ్చట్లను షేర్ చేసేవారు. దీంతో.. లాక్ డౌన్ వేళ.. ఏం జరుగుతుందన్న విషయాల్ని టీవీలో చూసినా.. సీఎం సాబ్ సోర్సు బలంగా ఉండటంతో పాటు.. ఆయన నోటి నుంచి వచ్చే సమాచారం ఆసక్తికరంగా ఉండేది. దీనికి తోడు కేసీఆర్ మాటల మహత్యం తెలిసిందే కదా. దీంతో.. ఆయన ప్రెస్ మీట్ ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆత్రుతతో ఎదురుచూసేవారు. ఎన్నో సందేహాలకు సమాధానాలు ఆయన మీడియా మీట్ తో లభించేవి. అపోహలకు చెక్ పెట్టేలా ఆయన మాటలు ఉండేవి.
ఒక దశలో రోజు మార్చి రోజు.. మూడు రోజులకోసారి ప్రెస్ మీట్లు పెట్టిన కేసీఆర్.. ఆ తర్వాత ఉన్నట్లుండి ప్రెస్ మీట్ పెట్టటం మానేశారు. కట్ చేస్తే.. మళ్లీ కరోనా మీద ఆయన ప్రెస్ తో పెట్టింది లేదు. తాజాగా కరోనా సీజన్ 2 షురూ అయిన సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో తెలంగాణలోనూ కేసుల నమోదు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు కరోనా కొత్త కాకున్నా.. దానికి సంబంధించిన భయాలు మాత్రం ఎప్పటికప్పుడు కొత్తగా అనిపిస్తున్నాయి. మరి.. ఇలాంటివేళలో సీఎం కేసీఆర్ సీజన్ 2 ప్రెస్ మీట్లను నిర్వహిస్తారా? లేదా అన్నది ప్రశ్నగా మారింది. మరింత ఆసక్తిగా ప్రజలు ఎదురుచూస్తున్న వేళ.. సారు వారి ప్రెస్ మీట్ మరెప్పుడు పెడతారో?