చోరీ చేయటానికి వస్తే.. వయగ్రా ఇచ్చి ఫుల్ గా అనుభవించేసిందట

Update: 2020-12-06 04:21 GMT
జిహ్వకో రుచి.. పుర్రెకో బుద్ధి అని ఊరికే అనలేదు. ఇప్పుడు చెప్పే ఉదంతం ఇలాంటికోవకు చెందిందే. తన షాపులో చోరీ చేసేందుకు వచ్చిన దొంగకు దిమ్మ తిరిగే అనుభవాన్ని ఇచ్చిందో పాతికేళ్ల యువత. విన్నంతనే ఏ మాత్రం నమ్మరు కానీ.. జరిగింది నిజమని సదరు యువతి కూడా ఒప్పుకోవటం సంచలనంగా మారింది. ఇలా కూడా చేస్తారా? అన్నట్లు ఉండే ఈ ఉదంతం రష్యాలో చోటు చేసుకుంది.

విక్టర్ అనే దొంగ ఒక బ్యూటీపార్లర్ లో దొంగతనం చేసేందుకు వెళ్లాడు. అతడు చోరీ చేస్తున్న సమయంలోనే.. ఆ పార్లర్ ఓనర్ ఓల్గా జాజాక్ తిరిగి వచ్చింది. పాతికేళ్ల ఈ యువతి ఆ దొంగను పట్టుకొని బంధించింది. పార్లర్ వెనుకున్న  చీకటి గదిలో కట్టేసిన ఆమె.. అతడికి ఎలాంటి ఆహారం ఇవ్వకుండా.. రోజుకు నాలుగు వయగ్రా ట్యాబ్లెట్లు మాత్రమే ఇచ్చేది. అతడ్ని అనుభవించేది. నాలుగు రోజుల పాటు ఇలా చేసిన ఆమె.. ఆ తర్వాత విడిచిపెట్టింది.

ఊహించని అనుభవం ఎదురైన ఆ దొంగ.. తనకు జరిగిన అన్యాయంపై పోలీసుల్ని ఆశ్రయించారు. తనను బలత్కారం చేసిందని.. ఎలాంటి ఆహారం ఇవ్వకుండా కేవలం వయగ్రా ట్యాబ్లెట్లు ఇచ్చి తన కోరికను తీర్చుకోవటంపై కంప్లైంట్ ఇచ్చాడు. దీంతో షాక్ తిన్న పోలీసులు ఓల్గాను పోలీస్ స్టేషన్ కు పిలిచి విచారించారు. దొంగను బంధించి.. అతడికి వయాగ్రా ట్యాబ్లెట్లు ఇచ్చి అనుభవించింది నిజమేనని ఒప్పుకుంది. అయితే.. దొంగకు బుద్ధి చెప్పటానికే తానీ పని చేసినట్లుగా ఆమె చెప్పింది.

అయితే.. తాను రోజుకు రెండుసార్లు మాత్రమే సెక్సు చేశానని.. అతడికి కొత్త బట్టలు కొనిచ్చానని.. తిండి కూడా పెట్టినట్లు చెబుతోంది.చివర్లో వెళ్లేటప్పుడుకాసిన్ని డబ్బులు కూడా ఇచ్చానని తన నిజాయితీని చెప్పుకొచ్చింది. దీంతో.. షాక్ తిన్న పోలీసులు.. ఈ ఉదంతంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. ఇంతకూ దొంగకు బుద్ధి చెప్పేందుకు ఆమె చేసిన ప్రయత్నం ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందన్నది ఇంకా తేలలేదు.
Tags:    

Similar News