మన పాస్ పోర్టు ర్యాంకు ఎప్పటికి మెరుగుపడుతుంది మోడీ?

Update: 2021-01-13 03:42 GMT
ప్రపంచంలో సూపర్ పవర్ అని చెప్పుకోవచ్చు. కానీ.. ప్రపంచంలో అతి శక్తివంతమైన పాస్ పోర్టు ఏమిటన్న విషయంలోకి వెళితే.. రెండింటికి మధ్య పొంతన అస్సలు కుదరదు. అర్థం కాలేదా? వివరంగా చెబుతాం. ప్రపంచానికి పెద్దన్న ఎవరంటే అమెరికా. ఆ మాటకు వస్తే.. ఆ దేశానికి మించిన దేశం కనిపించదు. కానీ.. ఆ దేశ పాస్ పోర్టుకు ప్రపంచంలో అత్యుత్తమ పాస్ పోర్టు ర్యాంకులో ఏడో స్థానంలో ఉంటుంది. మరి.. మొదటి ర్యాంకులో ఉన్న పాస్ పోర్టు ఏ దేశానిది? అంటారా? సమాధానం మీరు ఊహించలేనిది. అవును.. బుల్లి దేశమైన జపాన్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్ పోర్టు. రెండో స్థానం సింగపూర్ ది.

పవర్ ఫుల్ పాస్ పోర్టు అయితే లాభం ఏమిటంటారా? ముందస్తు వీసా లేకుండా ఏ దేశానికైనా వెళ్లే అవకాశం ఉంటుంది. జపాన్ పాస్ పోర్టు ఉన్న వ్యక్తి ప్రపంచంలోని 191 దేశాల్లో ముందస్తు వీసా ఏమీ లేకుండానే తిరిగి రావొచ్చు. మన దేశానికి వస్తే మన ర్యాంకు 84. మన దేశ పాస్ పోర్టులో కేవలం 58 దేశాల్లో మాత్రమే ముందస్తు వీసా అవసరం లేకుండా తిరిగేందుకు వీలుంది. హెన్లీ అండ్ పార్టన్స్ పాస్ పోర్ట్ ఇండెక్స్ 2021 ప్రకారం చూస్తే.. గత ఏడాది భారత పాస్ పోర్టు 85వ స్థానంలో ఉంటే.. తాజాగా 84వ స్థానానికి చేరుకుంది. అంతే ఒక ర్యాంకు మెరుగుపర్చుకున్నామట.

ర్యాంకు తగ్గుతున్న కొద్దీ.. పలు దేశాలకు వీసా తీసుకోకుండానే ప్రయాణించే వీలుంటుంది. తాజా ఇండెక్స్ ప్రకారం తజికిస్థాన్ తో భారత్ పంచుకుంది. ఇక.. పవర్ ఫుల్ పాస్ పోర్టుల ఇండెక్స్ లో అగ్రస్థానంలో నిలిచిన జపాన్.. ఈ రికార్డును ముచ్చటగా మూడోసారి సొంతం చేసుకుంది. రెండో స్థానంలో నిలిచిన సింగపూర్ పాస్ పోర్టు ఉన్నవారు 190 దేశాలకు ముందస్తు వీసా అవసరం లేకుండానే వెళ్లొచ్చు. మూడో స్థానంలో దక్షిణ కొరియా.. జర్మనీ కలిసి పంచుకున్నాయి. ఈ రెండు దేశాల పాస్ పోర్టులు ఉన్న వారు వీసా అవసరం లేకుండానే 189 దేశాల్లో ప్రయాణించే వీలుంది.

ప్రపంచ దేశాల్ని ఖండాల వారీగా తీసుకుంటే.. మోస్ట్ పవర్ ఫుల్ పాస్ పోర్టు ఉన్న దేశాల్లో మొదటి మూడు ఆసియా ఖండానికి చెందిన దేశాలే ఉండటం గమనార్హం. అయితే.. మూడో స్థానంలో ఆసియా దేశంతో పాటు యూరోప్ కు చెందిన జర్మనీ ఉన్నప్పటికీ.. ఆసియా దేశం ఉండటం విశేషంగా చెప్పాలి. ఇక.. అగ్రరాజ్యాలుగా చెప్పే అమెరికా.. బ్రిటన్ దేశాల పాస్ పోర్టులు ఏడో స్థానంలో నిలుస్తాయి.

అత్యంత ధనిక దేశాలుగా చెప్పే బుల్లి దేశాలైన ఫిన్లాండ్.. ఇటలీ.. లగ్జెంబర్గ్.. స్పెయిన్ దేశాలు నాలుగో స్థానంలో నిలిచాయి. ఈ దేశాల పాస్ పోర్టు ఉన్న వారు 188 దేశాలకు వీసా లేకుండా వెళ్లి రావొచ్చు. మరీ జాబితాలో అట్టడుగు స్థానం ఉన్న దేశం ఆఫ్ఘనిస్తాన్ అయితే.. కింద నుంచి నాలుగో స్థానంలో పాకిస్తాన్ నిలుస్తుంది. ఈ లెక్కన మన దేశం టాప్ 25లోకి వెళ్లాలంటే ఇంకెంత కాలం పడుతుందో. అత్యంత ప్రభావవంతమైన.. శక్తివంతమైన ప్రధానమంత్రి దేశాన్ని ఏలుతున్న వేళలోనూ.. భారతదేశ పాస్ పోర్టు ర్యాంకు వేగంగా ఎందుకు మెరుగుపడటం లేదంటారు?
Tags:    

Similar News