వైఎస్ విజయమ్మ ఓటు ఎక్కడ...?

Update: 2023-04-26 17:00 GMT
వైఎస్ విజయమ్మ. భర్త చాటు భార్యగానే ఆమె సగానికి పైగా జీవితం గడచింది. ఆమె వైఎస్సార్ సతీమణిగా మాత్రమే తెలుగు జనాలకు పరిచయం. వైఎస్సార్ మూడున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో అలుపెరగని పోరాటం చేశారు. ఏనాడూ ఆయన కుటుంబాన్ని తనతో పరిచయం  చేయలేదు. తానే ఒంటరిగా రాజకీయ రణక్షేత్రంలో ఎదుర్కొన్నారు. పదవీ ఉన్నా లేకపోయినా జనంలోనే ఉంటూ వారి గుండెల్లో కొలువయ్యారు.

వైఎస్సార్ కష్టపడి తన రాజకీయ జీవితాన్ని నిర్మించుకున్నారు. ఎంతో శ్రమపడి ఓర్పుతో నేర్పుతో ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. వైఎస్సార్ మరణం తరువాత ఆయన సతీమణి వైఎస్ విజయమ్మ బయటకు రావాల్సి వచ్చింది. అది అనివార్యంగా జరిగింది. అలాగే కుమారుడు కుమార్తె సైతం వైఎస్ బిడ్డలుగా జనాలకు పూర్తి స్థాయి లో అలా పరిచయం అయ్యారు.

ఇక చూసుకుంటే వైఎస్ విజయమ్మ పక్కా రాయలసీమ వాసి. ఆమె పుట్టిన వూరు అనంతపురం. ఆమె మెట్టిన ఊరు కడప. ఇలా ఆమె ఏపీతోనే సంబంధం ఉన్న మహిళగా కనిపిస్తారు వైఎస్సార్ కుటుంబంలో ఆమె భాగంగా ఉంటూ వచ్చారు. వైఎస్ విజయమ్మ భర్త తో కలసి హైదరాబాద్ లో ఏనాడో సెటిల్ అయినా ఓటు హక్కు మాత్రం ఆ మొత్తం కుటుంబానిది పులివెందుల లోనే ఉంటుంది అని అందరికీ తెలుసు.

జగన్ కానీ షర్మిల కానీ విజయమ్మ కానీ పులివెందులలోనే గతంలో ఓటేసిన సందర్భాలు ఉన్నాయి. ఇపుడు చూస్తే షర్మిల తెలంగాణా లో వైఎస్సార్టీపీ పేరు మీద పార్టీ పెట్టారు. ఆమె అక్కడే రాజకీయం చేస్తున్నారు.

ఆమె తాను తెలంగాణా కోడలిని అని చెప్పి తన పాలిటిక్స్ ని లోకల్ గా క్లెయిం చేసుకునే పనిలో ఉన్నారు. ఆమె పార్టీకి గౌరవ అధ్యక్షురాలిగా వైఎస్ విజయమ్మ ఉన్నారు. ఆమె హైదరాబాద్ లో జీవిస్తున్నా ఆమె ఓటు హక్కు ఎక్కడ అన్నది ఇపుడు ప్రశ్నగా ముందుకు వస్తోంది.

ఎందుకంటే విజయమ్మ కూతురుకు అండగా ఉంటూ వైఎస్సార్టీపీ లో రాజకీయం చేస్తున్నారు. కుమార్తె తరఫున ఆమె జనంలోకి వస్తున్నారు. కుమార్తె తరఫున నిరసనలు చేస్తున్నారు. షర్మిల పార్టీ తెలంగాణా కోసం పెట్టారు కాబట్టి ఆమె ఓటు హక్కు హైదరాబాద్ కి మార్చుకునే అవకాశం ఉంది. ఎందుకంటే అది ఆమెకు లోకల్ ప్రూవ్ ని ఇస్తుంది. పైగా విమర్శలు కూడా వస్తాయి. ఈపాటికే షర్మిల ఆ పని చేసి ఉంటారని అంటున్నారు.

మరి విజయమ్మ సంగతేంటి అన్న ప్రశ్నలు వస్తున్నాయి. విజయమ్మ తన ఓటు హక్కుని ఎక్కడ వినియోగిస్తారు. ఆమె ఓటు కడప జిల్లా పులివెందులలో ఉందా లేక హైదరాబాద్ కి ఆమె కూడా ఓటుని షిఫ్ట్ చేసుకున్నారా అన్నదే చర్చగా ఉంది. అలా కనుక జరిగితే ఏపీతో ఆమెకు రాకీయ బంధం పూర్తిగా తెగిపోయినట్లే అంటున్నారు. అలా కాదు ఏపీ లో జగన్ వైసీపీ ఉంది. దానికి ఆమె ఆశీస్సులు ఎపుడూ ఇస్తానని చెప్పి ఉన్నారు కాబట్టి పులివెందుల లో ఓటును అలాగే ఉంచుకుంటే మాత్రం ఆమె వైఎస్సార్టీపీ గౌరవ అధ్యక్షురాలి పదవిలో కొనసాగడం మీద కూడా విమర్శలు వస్తాయి.

ప్రస్తుతానికైతే ఎవరూ ఈ పార్టీని పెద్దగా పట్టించుకోవడంలేదని అంటున్నారు కాబట్టే ఓటు హక్కు దాకా ఎవరూ గట్టిగా మాట్లాడడం లేదు అంటున్నారు. అయితే ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఈ విషయాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. మొత్తానికి వైఎస్ విజయమ్మ  ఓటు ఎక్కడ అన్నది మాత్రం రాజకీయంగా హాట్ టాపిక్ గానే ఉంటుంది అని అంటున్నారు.

Similar News