కోవిడ్ కు చెక్ పెట్టే రెండు టీకాలకు అనుమతి లభించిన సంగతి తెలిసిందే. అందులో ఒకటి హైదరాబాద్ కేంద్రంగా పని చేసే భారత్ బయోటెక్ వారి కోవాగ్జిన్ కాగా.. మరొకటి ఫుణెలోని సీరం ఇన్ స్టిట్యూట్ కు చెందిన కోవిషీల్డ్. ఈ రెండింటిలో ఏది తెలంగాణకు వస్తుంది? అన్నది ప్రశ్న. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం.. ఏ వ్యాక్సిన్ తెలంగాణకు వస్తుందన్న దానిపై సమాచారం లేదు. ఏదో ఒక వ్యాక్సిన్ వస్తుందన్న అభిప్రాయంతో పాటు.. రెండు వచ్చినా రావొచ్చన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.
ఏదో ఒకటి రాష్ట్రానికి వచ్చినా.. రెండు వచ్చినా వాటిని ఎలా తీసుకొస్తారు? అన్నది మరో ప్రశ్న. అధికారుల అభిప్రాయం ప్రకారం సీరం వారి టీకా తెలంగాణకు రావాల్సి ఉంటే.. అది ఇన్సులేటెడ్ కార్గో విమానంలో తీసుకురానున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న తర్వాత ప్రత్యేక అతి శీతలీకరణ కంటైనర్ లో రాష్ట్రస్థాయి టీకా నిల్వ సెంటర్ కు తరలిస్తారు.
ఫూణె టీకా కాకుండా హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ వారి టీకాను తెలంగాణకు కేటాయిస్తే.. రోడ్డు మార్గంలో టీకా నిల్వ కేంద్రానికి వ్యాక్సిన్ స్టాక్ ను తరలిస్తారు. టీకాల్ని రాష్ట్ర స్థాయి నిల్వ కేంద్రానికి చేర్చటం.. అక్కడి నుంచి జిల్లా కేంద్రాలకు తరలించటం.. ఆ తర్వాత ఆసుపత్రులకు చేరవేయటం చాలా ప్రధానమైనది. టీకా చేరవేతలో నాలుగు విభాగాలు చాలా కీలకం. అవి సివిల్.. ఎలక్ట్రికల్.. పరికరాలు.. ఔషధాలుగా చెబుతున్నారు.
టీకా నిల్వకు అవసరమైన అన్ని పనుల్ని యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేయటమే కాదు.. నిధులను విడుదల చేశారు. దీంతో.. రాష్ట్రస్థాయి నుంచి టీకాలు పంపిణీ చేసే కేంద్రాల వరకు అన్ని దశల్లో ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. అన్నింటికంటే ప్రధానమైనది.. టీకా కేంద్రాల్లోని టెంపరేచర్. టీకాలు ఏవైనా సరే అతి శీతల కేంద్రాల్లో ఉంచాల్సిన అవసరం ఉంది. మరి.. దీని పర్యవేక్షణ ఎలా? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే.. ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తాయి.
కేంద్రం ప్రవేశ పెట్టిన కోవిన్ యాప్ ద్వారా అతి శీతల పరికరాల పర్యవేక్షణ సాధ్యం కానుంది. అన్ని స్థాయిల్లోని అతి శీతల పరికరాల్లో ఉష్ణోగ్రత నిబంధనలకు అనుగుణంగా ఉందా? లేదా? అన్నది ఎప్పటికప్పుడు చెక్ చేస్తుంటారు. ఒకవేళ ఎక్కడైనా తేడా ఉంటే అలెర్టు చేయటానికి తగిన అలారమ్ సిస్టమ్ ను యాప్ లో ఉండటం కారణంగా.. ఇబ్బందులు ఉండవంటున్నారు.