కరోనా వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందంటే..: WHO

Update: 2020-06-19 16:00 GMT
ప్రపంచంలోని అన్ని దేశాలకు కరోనా మహమ్మారి సోకింది. లక్షల మంది ప్రాణాలు తీస్తోంది. ఇప్పుడు అన్ని పనులు బంద్ చేసి కరోనాను కంట్రోల్ చేయడంపైనే ప్రపంచదేశాలన్నీ దృష్టి సారించాయి. అయినా ఈ మహమ్మారి తీవ్రత తగ్గడం లేదు. అమెరికా, భారత్ వంటి దేశాల్లో విశృంఖలంగా వ్యాపిస్తూనే ఉంది. ఇప్పటికే చాలా దేశాలు లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాయి. అయినా పెద్దగా ఫలితాలు కనిపించడం లేదు. ఇప్పుడిప్పుడే ఈ వైరస్ తోనే ప్రపంచం జీవించడం మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే పెద్దవారు, చిన్నపిల్లలు ఇంట్లోంచి బయటకు రావడం లేదు. స్కూళ్లు తెరుచుకోవడం లేదు.

ఇప్పుడు అందరూ కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టేందుకే విస్తృత పరిశోధనలు చేస్తున్నారు. వాక్సిన్ వస్తే ఈ మహమ్మారి నుంచి మానవాళిని కాపాడగలమని అన్ని దేశాలు భావిస్తున్నాయి.ఇప్పటికే అన్ని దేశాల్లో వ్యాక్సిన్ ప్రయోగాలు చురుకుగా సాగుతున్నాయి.

కాగా వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందనే దానిపై తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్.వో) ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య స్వామినాథన్ కీలక విషయాలు వెల్లడించారు. ఈ ఏడాది చివరికల్లా కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు.

ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ ఒకటి క్లినికల్ ట్రయల్స్ కి సంబంధించిన మూడో దశలో ఉందని.. ఇది త్వరలోనే అందుబాటులోకి రానుందని ఆయన తెలిపారు.
Tags:    

Similar News