ప్రపంచ జనాభాలో 10శాతం మందికి కరోనా

Update: 2020-10-05 17:34 GMT
ప్రపంచ జనాభాలో దాదాపు 10శాతం మందికి కరోనా సోకిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ బాంబు పేల్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర పరిస్థితుల అధిపతి సోమవారం ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 10 మందిలో ఒక వ్యక్తికి కరోనావైరస్ సోకినట్లు తెలిసిందని చెప్పారు. ధృవీకరించబడిన కేసుల సంఖ్య కంటే 20 రెట్లు ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి విస్తరించిందని ఆయన వివరించారు. ప్రపంచానికే ఇది కష్టతరమైన కాలం అని హెచ్చరించారు.

కరోనా వైరస్ పై దృష్టి సారించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఇందులో డాక్టర్ మైఖేల్ ర్యాన్ మాట్లాడుతూ, ఈ కరోనా వైరస్ వ్యాప్తి గణాంకాలు పట్టణాల నుండి గ్రామీణ ప్రాంతాలకు.. వివిధ సమూహాల మధ్య మారుతూ ఉంటాయి. ప్రపంచంలోని అధిక శాతం మంది మాత్రం ప్రమాదంలో ఉన్నారు అని వివరించారు. మహమ్మారి విస్తరిస్తూనే ఉంటుందని, అయితే దాన్ని అణచివేయడానికి.. ప్రాణాలను కాపాడటానికి ఆ సాధనాలు ఉన్నాయని ఆయన తెలిపారు.

డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ మాట్లాడుతూ.. బాధితులకు చికిత్స చేస్తూ వారిని కాపాడటానికి కృషి చేసిన ఆరోగ్య కార్యకర్తలకు ప్రశంసలు తెలుపుతున్నట్టు వివరించారు. ఆగ్నేయాసియా కేసుల పెరుగుదలను ఎదుర్కొందని, యూరప్.. తూర్పు మధ్యధరా దేశాల్లో మరణాలు పెరుగుతున్నాయని ర్యాన్ చెప్పారు, ఆఫ్రికా మరియు పశ్చిమ పసిఫిక్ పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయని వివరించారు.

"ప్రపంచ జనాభాలో 10 శాతం మంది ఈ వైరస్ బారిన పడ్డారని మా ప్రస్తుత మా దగ్గర అంచనాలు చెబుతున్నాయి" అని ర్యాన్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశంలో వివరించారు. ప్రస్తుత ప్రపంచ జనాభా 7.6 బిలియన్లు. ఇందులో 760 మిలియన్లకు పైగా జనాభా ఉన్నట్లు అంచనా. డబ్ల్యూ.హెచ్.వో జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం ధృవీకరించబడిన కేసుల సంఖ్యను మించిపోయిందని వివరించారు. ధృవీకరించబడిన కేసుల సంఖ్య నిజమైన సంఖ్యను చాలా తక్కువగా నిపుణులు చాలాకాలంగా చెప్పారు.ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం అదే విషయాన్ని చెప్పింది.

ప్రపంచం ఇప్పుడు కష్టాల్లో ఉందని.. ఈ వ్యాధి వ్యాప్తి చెందుతూనే ఉందని.. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో మహమ్మారి పెరుగుతోందని రియాన్ హెచ్చరించాడు.
Tags:    

Similar News