ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రమాదకర స్థితికి మానవ జాతిని తీసుకెళ్తోంది. ఈ క్రమంలో కేసుల సంఖ్య అమాంతంగా పెరుగుతుంది. అమెరికా , ఫ్రాన్స్, ఇటలీ, బ్రిటన్ లాంటి దేశాల్లో వైరస్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఇదిలా ఉంటే మరణాల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతోంది.
అయితే ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ఇప్పటికే ప్రపంచ దేశాలు చాలా కృషి చేస్తున్నాయి. వీటిలో భాగంగానే వైరస్ వ్యాప్తి చెందకుండా కరోనా వైరస్ ప్రోటోకాల్ ను పాటిస్తున్నాయి. సామాజిక దూరం పాటించడంతోపాటు మాస్కులు ధరించడం లాంటివి ప్రజలు తప్పకుండా పాటించాలని ఇప్పటికే చాలా దేశాల ప్రభుత్వాలు ఆదేశాలను జారీ చేశాయి.
ఇదిలా ఉంటే దక్షిణాఫ్రికాలో వెలుగు చూసినటువంటి కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఓమిక్రాన్ ను అరికట్టేందుకు డబ్ల్యూహెచ్ఓ కీలక సూచనలు చేసింది. కరోనా వైరస్ ఆంక్షలను కఠినంగా అమలు చేయడంతో పాటు వ్యాక్సినేషన్ ను భారీగా పెంచాలని సూచించింది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అయినటువంటి డబ్ల్యూహెచ్ఓ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య స్వామినాథన్ ఈ మేరకు సూచనలు చేశారు.
ప్రపంచ దేశాలు కరోనా వైరస్ తో పోరాడడానికి టీకా పంపిణీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ సూచించారు. టీకా పంపిణీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం వల్ల కరోనా వైరస్ కొత్త వేరియంట్ అయినా ఒమిక్రాన్ ను సులభంగా కట్టడి చేయవచ్చని పేర్కొన్నారు.
వాక్సినేషన్ కార్యక్రమాన్ని అట్టడుగు స్థాయి వారికి కూడా చేరేలా వివిధ దేశాల ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. టీకా పంపిణీ కార్యక్రమాన్ని పేద బలహీన వర్గాలకు కూడా చేరేలా అన్ని దేశాలు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని చెప్పారు. ఇలా చేయడం వల్ల కొత్త వేరియంట్ ను ఎదుర్కోగల మని పేర్కొన్నారు.
ఇప్పటికే 130 కి పైగా దేశాలలో కరోనా వైరస్ కొత్త వేరియంట్ కేసులు నమోదు అయ్యాయని ఆమె గుర్తు చేశారు. ఈ క్రమంలోనే ఈ వైరస్ వ్యాప్తి డెల్టా కంటే ఎక్కువగా ఉందని చెప్పారు. కేవలం కొద్ది రోజుల్లోనే కేసుల సంఖ్య అమాంతం పెరుగుతోందని స్పష్టం చేశారు. దీనిని అడ్డుకోవాలంటే ఏకైక మార్గంగా వ్యాక్సినేషన్ ను పూర్తి స్థాయిలో ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్ఓ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ సూచించారు.
కరోనా వైరస్ కొత్త వేరియంట్ అయినా ఒమిక్రాన్ ను ఎదుర్కొనేందుకు టీకాలు ప్రభావవంతంగా పని చేస్తున్నాయని ఆమె తెలిపారు. అయితే టీకా తీసుకున్న వారికి కూడా కరోనా వైరస్ కొత్త వేరియంట్ సోకుతుందని ఆమె గుర్తు చేశారు.
ఇలా ఉంటే వైరస్ పై పోరులో టీకాల పనితీరును తక్కువ చేసి చూడాల్సిన అవసరం లేదని ఈ మేరకు స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్ తీసుకున్న వారిలో రోగ నిరోధక శక్తి ఎక్కువగానే ఉందని ఆమె గుర్తు చేశారు. అంతేకాకుండా టీకా తీసుకున్న వారు కొత్త వేరియంట్ సోకిన ఆస్పత్రి పాలు కావడం తక్కువగా ఉందని స్పష్టం చేశారు.