చైనాలోని వూహాన్ నగరంలో కరోనా పుట్టింది. కరోనా పుట్టినిల్లు ఆ నగరమే.. అక్కడి నుంచి చైనాలోని ఇతర ప్రాంతాలకు.. ఇతర దేశాలకు పాకింది. ప్రపంచాన్ని అతలాకుతలం చేసి లక్షలమందిని చంపేసింది.
తాజాగా కరోనా వైరస్ మూలాలు కనుక్కునే పనిలో డబ్ల్యూ.హెచ్.వో పడింది. దీనికోసం 10 మంది నిపుణులతో కూడిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ.హెచ్.ఓ) బృందం చైనాలోని కరోనా పుట్టినిల్లు వూహాన్ లో పని మొదలుపెట్టింది.
కరోనా మూలాలను గుర్తించేందుకు చైనా వెళ్లిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ.హెచ్.ఓ) బృందం ఎట్టకేలకు దర్యాప్తు ప్రారంభించింది. చైనా నిబంధనల ప్రకారం వూహాన్ లో 14 రోజుల పాటు క్వారంటైన్ తర్వాత క్షేత్రస్తాయి పర్యటనకు వెళ్లింది.
14మంది సభ్యులు చైనాలోని వూహాన్ లో నెలరోజుల పాటు పరిశోధన చేయనున్నారు. కరోనా మానవులకు ఎలా సంక్రమించిందనే దానిపై అన్వేషించనున్నారు. వైరస్ లీక్ అయినట్లు అనుమానిస్తున్న వూహాన్ వైరాలజీ ల్యాబ్ ను కూడా వీరు పరిశీలిస్తారా? లేదా అనే దానిపై క్లారిటీ లేదు.
కరోనా సోకిన తొలి వ్యక్తి ‘పేషెంట్ జీరో’ను కనుక్కునే పనిలో పడింది. అయితే కరోనా సోకిన తొలి వ్యక్తిని కనిపెట్టడం అసాధ్యమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ.హెచ్.వో) పేర్కొంది. ఖచ్చితంగా చెప్పాలంటే ఎప్పటికీ కనిపెట్టలేకపోవచ్చని డబ్ల్యూ.హెచ్.వో వ్యాధుల విభాగం టెక్నికల్ లీడ్ మారియా వాన్ స్పష్టం చేసింది. దీంతో కరోనా మూలాలు కనుక్కోవడం అసాధ్యమన్న సంగతి తెలిసిపోయింది.
సరికొత్త వైరస్ లపై పరిశోధన చేస్తున్న చైనా శాస్త్రవేత్తలు చేసిన అశ్రద్ధ వల్లే ఇప్పుడు కరోనా ప్రపంచానికి అంటుకుందని డబ్ల్యూహెచ్.వో ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ.హెచ్.ఓ) నిబంధనలను పాటించకుండా.. గ్లోవ్స్, మాస్క్ లు ధరించకుండా ఓ గబ్బిలాల గుహలోకి వెళ్లారని ఇప్పటికే బయటపడింది. ఈ గుహలో కరోనా సోకిన గబ్బిలాలు తమను కుట్టినట్టు వూహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (డబ్ల్యూఐవీ) శాస్త్రవేత్తలు అంగీకరించారట.. దీంతో చైనా శాస్త్రవేత్తల ప్రయోగాలే ఇప్పుడు ప్రపంచానికి శాపంగా మారాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమానించి ఇప్పుడు పరిశోధన ప్రారంభించింది.