గులాబీ తోటలోంచి జారిపోతున్నారు. ఒక పూవు పోగానే మరో పువ్వు ఆ వాసనకు మళ్లిపోతోంది. ఇప్పటికే అసమ్మతి రాజేసిన పొంగులేటిని కలిసిన జూపల్లి తిరుగుబాటు చేశారు. ఈ ఇద్దరు కేసీఆర్ ను తిట్టగానే సస్పెన్షన్ వేటు పడింది. గులాబీ పార్టీలో రెండుసార్లు అధికారంలోకి వచ్చిన వ్యతిరేకత ఇప్పటికీ కనిపిస్తోంది. ఫస్ట్ టర్మ్ లో అసమ్మతి పెద్దగా లేదు. కానీ రెండో టర్మ్ లో మాత్రం రాష్ట్రవ్యాప్తంగా శ్రేణులు బయటపడుతున్నారు. నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. పార్టీ అధిష్టానం తీరే కారణమని విమర్శలున్నాయి.
ఈ అసమ్మతికి ప్రధాన కారణం నేతల ఓవర్ లోడ్ నే.. కొన్ని చోట్ల విపక్ష పార్టీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడంతో అసమ్మతి మొదలైంది. ఇంకొన్ని చోట్ల ఎమ్మెల్యేలకు ప్రయారిటీ ఇవ్వడం.. సీనియర్ లీడర్లను పట్టించుకోకపోవడంతో అసమ్మతి రాగాలు మొదలయ్యాయి. ఇతర పార్టీలకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, సీనియర్ లీడర్లను పార్టీలో చేర్చుకున్నారు. ఎన్నికల నాటికి ఏదో ఒక పదవినో, లేకపోతే ఎమ్మెల్యే సీటునో ఇస్తామని హామీ ఇచ్చారు.కానీ చాలామందికి దక్కలేదు. దీంతో వారు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే బీఆర్ఎస్ లో అసమ్మతి రాజేస్తున్నారు. ఇప్పుడు ఆయనకు తోడుగా జూపల్లి కృష్ణరావు కూడా తోడయ్యారు. ఇద్దరినీ సస్పెండ్ చేసిన తర్వాత మరిన్ని గొంతులు లేసే ప్రమాదం ఉంది.
నెక్ట్స్ టార్గెట్ ఎవరన్నది బీఆర్ఎస్ లో చర్చనీయాంశమైంది. అన్ని చోట్ల ఇదే ఫార్ములానే అప్లయ్ చేస్తారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ బుజ్జగిస్తారా. భయపెడుతారా? సస్పెన్షన్ వేటు వేస్తారా? అందరి విషయంలో అన్నది ఆసక్తి రేపుతోంది.
తెలంగాణలో సెప్టెంబర్ నాటికి అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ వెలువడే ఛాన్స్ ఉంది. ఈలోపు అసమ్మతికి ఫుల్ స్టాప్ పెట్టాలని కేసీఆర్ పట్టుదలగా ఉన్నారు. తాజాగా కేసీఆర్ , కేటీఆర్ అసమ్మతి లీడర్లతో సంప్రదింపులు జరుపుతున్నారని.. కొందరితో అయితే నేరుగా కేసీఆర్ మాట్లాడుతున్నారని సమాచారం. మరికొందరితో కేటీఆర్ మాట్లాడుతున్నారట.. రాబోయే రెండు మూడు నెలల్లోనే పార్టీలో అసమ్మతిని చల్లార్చాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఎన్నికల నాటికి అంతా సద్దుమణిగేలా చేయాలని చూస్తున్నారు.
ప్రస్తుతం పొంగులేటి, జూపల్లి తర్వాత ఇతర పార్టీల నుంచి వచ్చి చేరి సీట్లు కోల్పోయిన నిజమైన గులాబీ నేతలు గళం విప్పేందుకు రెడీ అయ్యారు. ఒకరికంటే ఎక్కువమంది నియోజకవర్గ ఇన్ చార్జీలు ఉన్న చోటనే ఈ గొడవలు అవుతున్నాయి. పీటముడి నెలకొంది.వారే గళమెత్తుతున్నారు.