విచారణ సంస్థల్ని తన జేబు సంస్థలుగా కేంద్రంలోని మోడీ సర్కారు మార్చుకుందన్న విమర్శలు అంతకంతకూ ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ హడావుడి ఆరోపణల వేళ.. చాలామంది మిస్ అవుతున్న పాయింట్ ఏమంటే.. ఈడీ కావొచ్చు.. సీబీఐ కావొచ్చు.. ఐటీ శాఖ కావొచ్చు.. టార్గెట్ చేసిన విధానం సరిగా లేకపోవచ్చు కానీ.. టార్గెట్ చేసిన వ్యక్తులు తప్పులు చేయకుండా అయితే లేరు కదా? అన్న ప్రశ్న వినిపిస్తోంది. దర్యాప్తు సంస్థల్ని తప్పుగా వినియోగించటం అంటే.. తప్పు చేయని వారి మీద ప్రయోగించటం. అలా కాకుండా తప్పు చేసినప్పటికీ చూసిచూడనట్లుగా వ్యవహరిస్తూ.. తమకు అవసరమైన వేళ టార్గెట్ చేసే పద్దతిని కేంద్రంలోని మోడీ సర్కారు ఇప్పుడు పాటిస్తుందన్నది మర్చిపోకూడదు. అంటే.. ఇక్కడ కామన్ పాయింట్ తప్పు చేయటం.
తప్పు చేసిన వారిని కొన్ని సందర్భాల్లో చూసి చూడనట్లుగా వదిలేయటం.. మరికొన్ని సందర్భాల్లో వారి పీక పట్టుకోవటంలాంటివి చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కర్ స్కాం కూడా ఇలాంటి వ్యవహరామేనని చెబుతున్నారు. మద్యం కాంట్రాక్టులు.. అక్రమ పద్దతిని పాటిస్తూ చేపట్టిన ఈ విధానంలో వందల కోట్లు చేతులు మారినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ మీదా.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఫోకస్ పెట్టిన కేంద్రం.. తన తొలి లక్ష్యంగా ఢిల్లీ లిక్కర్ స్కాంను టేకప్ చేసినట్లుగా చెబుతుంటారు.
దీనికి కారణం లేకపోలేదు. ఈ స్కాం సరిగా వర్కువుట్ అయితే.. ఒక దెబ్బకు పలు పిట్టలన్నట్లుగా హోల్ సేల్ గా తన ప్రత్యర్థుల సంగతి చూడొచ్చన్నది పాయింట్. దాదాపు మూడు వారాల క్రితం ఢిల్లీ లిక్కర్ స్కాం గురించి ఢిల్లీకి చెందిన బీజేపీ నేతలు తెర మీదకు రావటం.. సంచలన ఆరోపణలు చేయటం తెలిసిందే. కట్ చేస్తే.. గత వారంలో ఈ స్కాంకు సంబంధించి మళ్లీ సోదాలు నిర్వహించటం.. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కమ్.. సీఎం కేసీఆర్ కుమార్తె కవిత వ్యవహారాల్ని చూసే ఆడిటర్ ఆఫీసు.. నివాసంలో తనిఖీలు చేయటం తెలిసిందే. వీరితో పాటు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లోనూ సోదాలు నిర్వహించారు.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ ఉదంతంలో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో పద్నాలుగో నిందితుడిగా ఉన్న మద్యం వ్యాపారి అరుణ్ రామచంద్రన్ పిళ్లైను ఈడీ అధికారులు ప్రశ్నించారు. అతడిది హైదరాబాద్. లిక్కర్ స్కాంలో మొదట్నించి రామచంద్రన్ పై ఆరోపణలు వస్తున్నాయి.
ఈ ఎపిసోడ్ లో ఆయనే కీలకంగా వ్యవహరించారన్న మాట వినిపిస్తోంది. ఎమ్మెల్సీ కవిత కుటుంబ సభ్యులకు ఆయన సన్నిహితుడన్న మాట వినిపిస్తోంది. రామచంద్రన్ ను ఈడీ అధికారులు విచారించిన వైనం ఇప్పుడు గులాబీ పార్టీలో హాట్ టాపిక్ గా మారినట్లు చెబుతున్నారు. ముడుపులు ఎవరెవరికి వెళ్లాయి? ఎవరి నుంచి వెళ్లాయి? లాంటి ప్రశ్నలకు సమాధానాల్ని సేకరించినట్లు చెబుతున్నారు.
ఈ స్కాంలో మైదరాబాద్ కు చెందిన ఐదారుగురు మద్యం వ్యాపారులు కీలకంగా వ్యవహరించినట్లుగా చెబుతున్నారు. మొత్తంగా ఢిల్లీ లిక్కర్ స్కాంను ఒక కొలిక్కి తెచ్చే వరకు సీబీఐ.. ఈడీలు నిద్ర పోనట్లుగా మారిందన్న మాట వినిపిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.