స‌మ‌తా మూర్తి అంటే ఎవ‌రు స‌ర్?

Update: 2022-02-06 10:30 GMT
ఒక్క‌డే దేవుడు ఒక్క‌డే రాముడు
ఒక్క‌డే జీవుడు ఒక్క‌డే కృష్ణుడు
ఒక్క‌డే అల్లా ఒక్క‌డే జీస‌స్ అంతా క‌లిస్తే
ప్ర‌పంచం విడ‌దీసి చూస్తే విషాదం
క‌లిపి ఉంచ‌డం స‌మాన‌త్వం విడ‌దీయడం మ‌హా పాపం
అవునా! అవును! మ‌రి మోడీ ఏం చేస్తున్నార‌ని?
పోనీ ఇత‌ర నాయ‌కులు అయినా ఏం చేస్తున్నార‌ని?

స‌మాన‌త్వం అన్న‌ది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న మ‌నందరి మ‌ధ్య ఎన్న‌టికీ అది సాధ‌న‌కు నోచుకోని ప్ర‌శ్న..అంటే అప‌రిష్కృతం అని అర్థం..ఇట్స్ ఎ అన్ సాల్వెంట్ వెర్ష‌న్ ఫ‌ర్ అజ్...

స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ (స‌మ‌తా మూర్తి విగ్ర‌హం) ఏం చెబుతుంది అన్న ప్ర‌శ్న ద‌గ్గ‌ర అంతా చేయాల్సిన ఆలోచ‌న ఇది.స‌మ‌తా మూర్తి అనే ప‌దం ద‌గ్గ‌ర ద‌గ్గ‌ర‌గా ఉన్న‌దెవ‌రు? దూరం అవుతున్న‌దెవ‌రు? దేశం గౌర‌వించ‌ద‌గ్గ నేత‌ల‌లో ఉన్న‌వారంతా స‌మాతా మూర్తులే అని భావించాలా అన్న సందేహం ఓ నెటిజ‌న్ వినిపిస్తున్నాడు. జ‌ర్న‌లిజం డిగ్రీ చ‌దువుకున్న ఓ కుర్రాడి ఆవేద‌న కార‌ణంగా చాలా విషయాలు వెలుగులోకి వ‌చ్చాయి.దేశంలో ఎన్నో పార్టీలు ఉన్నాయి. వాటికి అనుగుణంగానో, అనుస‌ర‌ణీయంగానో కులాలు ఉన్నాయి..మ‌తాలు ఉన్నాయి..మ‌రి!వీటి మ‌ధ్య స‌మాన‌త్వం అన్న‌ది తీసుకురావ‌డంలో మ‌న నాయ‌కులంతా చేస్తున్న కృషి ఎంత అన్నది సూటి ప్ర‌శ్న..

మురికికాలువ‌లు శుభ్రం చేసే మ‌నుషుల ద‌గ్గ‌ర జీవితాల‌ను త్యాగం చేసిన మ‌నుషుల ద‌గ్గ‌ర దేశ నాయకులు ఎలా ఉన్నారు ?

వారంతా త‌మ త‌మ ప‌నులు చ‌క్క‌దిద్దుకుంటున్నారు త‌ప్ప వారిని ఏకాగ్ర‌త‌తో కూడిన భావ‌న‌తో ప‌ట్టించుకోవ‌డంలేద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. క‌నుక ముచ్చింత‌ల్ విగ్ర‌హం ద‌గ్గ‌ర కానీ మ‌రోచోట కానీ స‌మాన‌త్వం అన్న‌ది ఓ భ్ర‌మ‌తో కూడిన భావ‌న.

దేవుడికి మ‌నిషికి మ‌ధ్య జంద్యం ఒక్క‌టే అడ్డు వ‌స్తుంద‌ని గ‌ద్ద‌ర్ పాడాడు. అది కాదు అని దేవుడిలో మ‌నిషి,మ‌నిషిలో దేవుడు ఒక్క‌టే అని చాటిన విశ్వ తేజం జ‌గ‌ద్గురువు, ఇంకా చెప్పాలంటే విప్ల‌వ తేజం రామానుజం అని అన్నారు...ఆ పాట‌లో..!

వింటూ వింటూ ఉంటే మ‌నుషులంతా త‌మదైన స‌మాన‌త్వాన్ని సాధించి ఉన్నారా? అందుకు ప్ర‌స్తుత పాల‌క వ్య‌వ‌స్థ ఏమ‌యినా

స‌హ‌క‌రిస్తుందా? కులాల పేరిట కార్పొరేష‌న్లు,మ‌తాల పేరిట తాయిలాలు అందిస్తున్న ప్ర‌భుత్వాలు మ‌నుషుల మ‌ధ్య స‌మాన‌త్వాన్ని ఎలా సాధిస్తాయి..అప్పుడే మ‌నం గోద్రా అల్ల‌ర్ల‌ను మ‌రిచిపోయాం అని అనుకోవాలి లేదా బాబ్రీ మ‌సీదు విధ్వంసం గురించి మ‌రిచిపోవాలి..అలాంట‌ప్పుడు మాత్ర‌మే మోడీని రాముడితో పోల్చాలి. ఆ ప‌ని చిన‌జియ‌ర్ స్వామి చేశారు.మ‌నం చేయాలో  వ‌ద్దో అన్న‌ది కాల‌మే నిర్ణ‌యిస్తుంది.

Tags:    

Similar News