ప్రకాశం జిల్లాలో ఇటీవల ఏపీ విపక్ష నేత చంద్రబాబు నిర్వహించిన రోడ్ షో సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు.. అనంతర ఉద్రిక్త పరిస్థితుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యర్రగొండపాలెంలో చంద్రబాబు పర్యటన వేళ.. ఆయన కాన్వాయ్ మీద రాళ్ల దాడి జరగటం.. ఈ సందర్భంగా చంద్రబాబుకు భద్రత కల్పించే కమాండో తలకు గాయం కావటం.. మూడు కుట్లు వేయటం తెలిసిందే. టీడీపీకి చెందిన మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. అయితే.. బాబు దళమే తమపై దాడికి దిగిందని మంత్రి ఆదిమూలపు సురేశ్ వాదిస్తున్నారు.
అంతేకాదు.. టీడీపీ వర్గాలు తమపై చేసిన దాడి కారణంగా తమకు చెందిన ముగ్గురు గాయపడినట్లుగా మంత్రి సురేశ్ చెప్పారు. మరి.. ఆ ముగ్గురు ఎవరంటే.. ఇద్దరి పేర్లు చెబుతున్న వైసీపీ వర్గాలు మూడో వ్యక్తి గురించి మాత్రం చెప్పకపోవటం గమనార్హం అని టీడీపీ ఆరోపిస్తుంది . రాళ్ల దాడిలో గాయపడిన వారిలో జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు కాగా.. ఇంకొకరు కంభంపాడు సర్పంచి. మరి.. మూడో వ్యక్తి ఎవరు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. రాళ్ల దాడిలో గాయపడిన వ్యక్తి గురించి ఇంత ఆసక్తి ఎందుకు? అన్న సందేహం రావొచ్చు. కానీ.. ఇక్కడే అసలు పాయింట్ ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
చంద్రబాబు పర్యటనకు రెండు రోజుల ముందే యర్రగొండ్లపాలానికి ఆరుగురు సభ్యులతో కూడిన ఐప్యాక్ టీం ఒకటి చేరుకుందని.. నిరసన కార్యక్రమాన్ని వారు డిజైన్ చేశారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.. ఇందులో భాగంగానే మంత్రి ఆదిమూలపు సురేశ్ నిరసన ప్రదర్శన..నల్ల దుస్తులతో నిలవటం.. చొక్కా విప్పటం లాంటివి చోటు చేసుకున్నాయని.. రాళ్లదాడి డిజైన్ కూడా వారిదేనన్న ఆరోపణలు ఉన్నాయి.
ఈ వాదనకు బలం చేకూరే అంశాల్ని టీడీపీ ఇప్పటివరకు చూపించటం లేదు. అయితే.. తాజాగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో ఆందోళన వేళలో మంత్రి సురేశ్ పక్కన కళ్లజోడు పెట్టుకొని.. గడ్డం ఉన్న ఒక కుర్రాడు మిగిలిన వారికి భిన్నంగా ఉండటం.. మంత్రితో దగ్గరగా మాట్లాడుతున్న ఫోటోలు బయటకు వచ్చాయి. టీడీపీ అధినేత చంద్రబాబు యర్రగొండ్ల పాలెం లోకి రావటానికి ముందు రోడ్డుపై మంత్రి నిరసన చేయటం.. ఆ సమయంలో మంత్రి పక్కనే ఉన్న ఆ యువకుడు మాట్లాడుతూ.. సలహాలు సూచనలు ఇస్తున్న ఫోటోలు చూపించి టీడీపీ సోషల్ మీడియా ఆరోపిస్తుంది .
దీనికి తోడు గాయపడినట్లుగా చెప్పిన మంత్రి అండ్ కో ఇద్దరు వివరాల్ని మాత్రమే వెల్లడించి.. మూడో వ్యక్తి వివరాల్ని ఎందుకు చెప్పటం లేదన్న దానికి కారణం.. ఐప్యాక్ సభ్యుల ఐడెంటిటీ బయటకు రాకూడదన్న ఆలోచనతోనేనని చెబుతున్నారు. ముందుస్తుగా వేసుకున్న ప్లానింగ్ లో భాగంగా ఉద్రిక్త పరిస్థితుల్ని ఏర్పడేలా ప్లాన్ చేశారంటున్నారు. టీడీపీ వర్గాలు రాళ్ల దాడికి పాల్పడినట్లుగా చెబుతున్న వేళ.. మందుగా తమ అధినేత.. తమపైనా రాళ్లు.. చెప్పల దాడి జరగటంతో తిరిగి బలంగా ఎదుర్కొనే క్రమంలో జరిగిన వ్యవహారంగా చెబుతున్నారు. ఈ సందర్భంగానే మంత్రి వర్గానికి చెందిన ముగ్గురికి గాయాలు అయినట్లుగా చెబుతున్నారు. మరి.. గాయమైన విషయాన్ని చెప్పిన మంత్రి.. గాయపడిన మూడో వ్యక్తం ఎవరు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. మరి.. ఈ సీక్రెట్ బయటకు వస్తుందా? అన్నది కాలమే డిసైడ్ చేయాలి.