ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన.. రెండు వారాల్లో ఫలితాలు

Update: 2020-07-04 06:45 GMT
ఒకే సమయంలో.. ఒకేలా యావత్ ప్రపంచం ఉక్కిరి బిక్కిరి అయ్యే సిత్రమైన సన్నివేశం.. మహమ్మారి కారణంగా చోటు చేసుకుందని చెప్పాలి. వందల కోట్ల మందిని భయభ్రాంతులకు గురి చేయటమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా 5.26 లక్షల మంది మరణాలకు కారణమైందీ మాయదారి రోగం. ఇప్పటి వరకు 1.10కోట్ల మందికి పాజిటివ్ తేలింది. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరగనుంది. ఈ మహమ్మారికి చెక్ పెట్టేందుకు దాదాపు 18కి పైగా సంస్థలు వ్యాక్సిన్ కనుగునేందుకు నిర్విరామం గా ప్రయోగాలు చేస్తున్నారు.

ఇప్పటికే 39 దేశాల్లో 5500 మంది మీద ప్రయోగాలు సాగుతున్నాయి. వీటికి సంబంధించిన కీలక రిపోర్టులు మరో రెండు వారాల్లో రానున్నట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా పరకటించింది. భారత్ తో పాటు.. ప్రపంచ దేశాల్లో అంతకంతకూ పెరుగుతున్న కేసుల్ని అదుపు లోకి తెచ్చేందుకు ఆయా ప్రభుత్వాలు కిందా మీదా పడుతున్న సాధ్యం కాని పరిస్థితి. ఇలాంటి వేళ.. వైరస్ వేగానికి కళ్లాలు వేయాలంటే వ్యాక్సిన్ కు మించిన ఆయుధం మరొకటి ఉండదు. వ్యాక్సిన్ ఎప్పటికి వస్తుందో ఇప్పుడే అంచనా వేయటం తెలివి తక్కువ పని అవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర కార్యక్రమాల విభాగాధిపతి మైక్ ర్యాన్ అభిప్రాయ పడుతున్నారు.

మనుషులపై వ్యాక్సిన్ ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలిసే అవకాశం ఈ ఏడాది చివరికి మాత్రమే తెలుస్తుందని చెబుతున్నా.. రెండు వారాల్లో వచ్చే నివేదికలు మాత్రం భవిష్యత్తు ఎలా ఉండబోతుందన్న ‘సీన్’ అర్థమయ్యేలా చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News